Home » Entertainment » Aha Ott Talk Show Balakrishna Unstoppable Super Rating In Imdb
Entertainment

Unstoppable : బాలకృష్ణ అడుగు పెడితే ఇంతే.. అన్ స్టాపబుల్‌ కు దక్కిన అరుదైన ఘనత ఏంటో తెలుసా?

Authored By
Himanshi
The Telugu News | Updated on: January 6, 2022, 11:59 am
Advertisement

Unstoppable : నందమూరి బాలకృష్ణ హీరోగా 2021 లో వచ్చిన అఖండ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇంకా కూడా భారీగా వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. అఖండ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగానే 2021 లో బాలయ్యకు మరో అఖండ విజయం దక్కంది అదే అన్‌ స్టాపబుల్‌. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అన్ స్టాపబుల్ తో బాలయ్య అభిమానులను మరియు ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలతో ప్రారంభం అయిన అన్ స్టాపబుల్‌ సూపర్‌ హిట్ అయ్యింది.

Advertisement

బాలయ్య హోస్ట్‌ గా ఏంటీ అంటూ అంతా అనుకున్నారు. ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే నవ్వు వస్తుంది.. సినిమా డైలాగ్స్ అయితే చెప్తాడు కాని లైవ్‌ లో ఆయన మాట్లాడటంకు కష్టపడుతూ ఉంటాడు. అలాంటి బాలయ్య తో టాక్ షో అంటే ఆయన పరువు తీయడం అవుతుందని.. అల్లు అరవింద్ కావాలని బాలయ్య బాబు పరువు తీసే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడా అంటూ విమర్శలు వచ్చాయి. కాని బాలయ్య పై అల్లు అరవింద్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అద్బుతమైన షో గా అన్ స్టాపబుల్ నిలిచింది.

aha ott talk show Balakrishna unstoppable super rating in IMDb

Advertisement

Unstoppable : ఐఎండీబీ లో అన్‌ స్టాపబుల్ రికార్డ్‌

సినిమాల రేటింగ్‌ విషయంలో అత్యంత పారదర్శకంగా.. యూజర్ల అభిప్రాయంను నమోదు చేసే ఐఎండీబి లో అన్ స్టాపబుల్‌ కు అద్బుతమైన రేటింగ్ రావడంతో పాటు ఇలాంటి షో ల జాబితాలో టాప్ 10 లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టాక్ షో లు ఉన్నాయి. అందులో బాలయ్య టాక్‌ షో నెం.5 స్థానంను దక్కించుకోవడం చాలా గొప్ప విషయం. కాఫీ విత్‌ కరణ్ నుండి మొదలుకుని బాలీవుడ్‌ లో పదుల సంఖ్యలో సెలబ్రెటీ టాక్‌ షో లు రన్‌ అవుతున్నాయి. కాని వాటన్నింటి కంటే ముందంజలో మన అన్ స్టాపబుల్‌ నిలిచింది. అద్బుతమైన టాక్ షో అంటూ ప్రేక్షకులు ఏకంగా 10 కి గాను 9 రేటింగ్‌ ను ఇవ్వడం జరిగింది.

సినిమా లతో కూడా బాలయ్య జోరు మీద ఉన్నాడు. అఖండ సినిమా ఇంకా థియేటర్‌ లోనే ఉంది అప్పుడే గోపీచంద్ మలినేనితో కలిసి సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ అప్పుడే సగం వరకు పూర్తి అయ్యిందని అంటున్నారు. మరో వైపు అనీల్‌ రావిపూడి సినిమా కూడా కథా చర్చలు పూర్తి అయ్యాయి. సమ్మర్‌ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య సినిమా ల పరంగా అన్ స్టాపబుల్‌ అన్నట్లుగా దూసుకు పోతున్నాడు. ఇక ముందు ముందు మరెంత మంది స్టార్స్ ను సూపర్‌ స్టార్స్ ను బాలయ్య తీసుకు వస్తాడో చూడాలి.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి