Home » Entertainment » Aishwarya Rai Divorce Matter Viral
Entertainment

Aishwarya Rai : ఐశ్వ‌ర్య‌రాయ్‌తో విడాకులు.. వెయిట్ చేస్తున్నానంటున్న అభిషేక్ బ‌చ్చ‌న్

Authored By
Sam C
The Telugu News | Published on: October 2, 2022, 9:30 pm
Advertisement

Aishwarya Rai : ఇటీవ‌లి కాలంలో సినీ ప్ర‌ముఖులు విడాకుల వ్య‌వ‌హారం అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది. విడాకుల విష‌యంలో కొన్ని వార్త‌లు నిజం కాగా, కొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. కొద్దికాలంగా దీపికా పదుకోన్-రణ్‌వీర్ సింగ్‌ల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని..ఎడమొహం పెడమొహంగా మారిందని బీ టౌన్ గాసిప్స్ విన్పిస్తున్నాయి. గాసిప్స్ వరకూ పరిమితమైతే ఫరవాలేదు..ఏకంగా ఉత్తరాదికి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ కూడా ఇద్దరి మధ్య బాగాలేదని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే విడాకులు తీసుకుంటారని ఉమైర్ సంధూ ట్వీట్ చేశాడు. దాంతో ర‌ణ్‌వీర్ సింగ్ త‌న విడాకుల‌పై ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తూ అవ‌న్నీ పుకార్ల‌ని కొట్టి పారేశాడు.

Advertisement

ఇక ఐశ్వర్య‌రాయ్ బ‌చ్చ‌న్- అభిషేక్ బ‌చ్చ‌న్ ( abhishek bachchan ) కూడా విడిపోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.చాలా సార్లు వీరి విడాకుల గురించి అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. తాజాగా మ‌రోసారి వీరి విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయింది.త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి విడాకులపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ గతంలో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వరరాయ్ విడిపోతున్నారు అంటూ వార్తలు రావడంతో అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో అభిషేక్….. నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

aishwarya rai divorce matter viral

Advertisement

Aishwarya Rai : పుకార్లా.. నిజ‌మా?

దానికి నేను సిద్ధమే…. అదే విధంగా నాకు రెండో పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే… అది మర్చిపోకండి. అంటూ వ్యంగంగా స్పందించాడు.ఆ ట్వీట్ ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ గురించి ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ…. ఐశ్వర్యరాయ్ తో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి అవసరం లేదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు. ఆమె ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ 2007 సంవత్సరం ఏప్రిల్ 20న పెళ్లి చేసుకోగా, ఈ జంట‌కు 2014లో ఆరాధ్య జన్మించింది. ఇటీవ‌ల ఐశ్వ‌ర్య‌రాయ్ ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌చారం కూడా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి