Home » Entertainment » Akhil And Hyper Aadi Remuneration For Dhee Dance Show In Etv
Entertainment

Hyper Aadi – Akhil : ‘ఢీ’ కి ఆది, అఖిల్‌ లు తీసుకునే పారితోషికం.. మరీ అంత తేడానా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 28, 2022 7:43 pm
Advertisement

Hyper Aadi – Akhil : హైపర్ ఆది ప్రస్తుతం అన్ని ఈటీవీ షో ల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. ప్రతి ఒక్క చోట కూడా ఈయన కామెడీ తో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన స్టార్‌ డమ్‌ ఇప్పుడు ఒక హీరో రేంజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైపర్ ఆది చేస్తున్న షో లకు మంచి రేటింగ్‌ వస్తుంది. అందుకే ఆయన్ను స్టార్‌ మా వారు కూడా బిగ్ బాస్ మరియు స్టార్‌ మా పరివార్‌ అవార్డ్‌ కార్యక్రమాల కోసం భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఢీ డాన్స్ షో లో హైపర్ ఆది సందడి చేస్తున్న విషయం తెల్సిందే. యాంకర్‌ ప్రదీప్ కంటే కూడా అధికంగా హైపర్ ఆది రెమ్యూనరేషన్‌ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక అదే ఢీ లో బిగ్ బాస్‌ రన్నర్‌ అఖిల్‌ కూడా పాల్గొంటాడు.

Advertisement

హైపర్ ఆది మరియు అఖిల్‌ ల మధ్య కామెడీ సన్నివేశాలు ఉంటాయి. ఒక టీమ్‌ లీడర్ గా అఖిల్‌ ఉంటాడు. అఖిల్‌ కి కూడా మంచి గుర్తింపు అయితే ఉంది. కానీ తాజాగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది కి వచ్చే పారితోషికం తో పోల్చితే అఖిల్‌ కి వచ్చే పారితోషికం చాలా తక్కువ. ఆది మరియు అఖిల్ లు సమానంగా ఢీ షో లో ఉంటారు. కానీ షో మొత్తం ఆది తన కామెడీ తో నడిపిస్తూ ఉంటాడు. కానీ అఖిల్‌ మాత్రం అంతగా సందడి చేయలేక పోతూ ఉంటాడు. ప్రతి సారి కూడా ఆది వేసిన పంచ్ కు నవ్వాలో సీరియస్ అవ్వాలో అర్థం కాక అఖిల్ కాస్త అటు ఇటు ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ అలా అలా షో లో నెట్టుకు వస్తున్నాడు అంటూ ఢీ ప్రేక్షకులు ముచ్చటించుకుంటూ ఉంటారు.

akhil and hyper aadi remuneration for dhee dance show in etv

Advertisement

అఖిల్‌ బిగ్‌ బాస్ రెండు సీజన్‌ లకు వెళ్లాడు. హీరోగా మంచి అవకాశాలు వస్తాయని చాలా నమ్మకంతో ఉన్నాడు. కానీ ఈయనకు అంత లేదు అంటూ చాలా మంది విమర్శిస్తున్నారట. బిగ్‌ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ వల్లే ప్రస్తుతం డాన్స్ షో లో నెట్టుకు వస్తున్నాడు. అంతే తప్ప గొప్పగా ఈయన అవకాశాలు దక్కించుకోవడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నామమాత్రం రెమ్యూనరేషన్‌ తో ఈయన చేస్తున్న షో లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటూ ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఆది తో పోల్చితే పారితోషికం విషయంలో అఖిల్ చాలా చాలా తక్కువ అనే సమాధానం మల్లెమాల వారి నుండి వినిపిస్తుంది. ఆది ఒక స్టార్‌ కనుక ఆయన స్థాయి రెమ్యూనరేషన్ ను ఎవరు ఆశించకూడదు అనేది కొందరి అభిప్రాయం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి