Home » Entertainment » Akkineni Akhil Marriage News
Entertainment

Akkineni Akhil : కేవలం అమల చేసిన పనికి అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోవడం లేదా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 20, 2023, 2:00 pm
Advertisement

Akkineni Akhil : ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి గౌరవం ఉందో అందరికీ తెలిసిందే. అయితే అక్కినేని నాగేశ్వరరావు టైం లో ఉన్న గౌరవం ఇప్పుడు అంతగా లేదనిపిస్తోంది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ సినిమాల పరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఫెయిల్ అవుతున్నారు. ఇక మనకు తెలిసిందే నాగార్జున మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున వారసులు కూడా అలాంటి తప్పులే చేశారు.

Advertisement

Akkineni Akhil marriage news

నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అఖిల్ కూడా మొదటగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ ను ప్రేమించాడు. వీరిద్దరికీ ఎంతో వైభవంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. నాగచైతన్య కు, అఖిల్ కు ఒకేసారి పెళ్లి చేయాలను నాగార్జున డిసైడ్ అయ్యాడు. అఖిల్ కు పెళ్లి ఏర్పాట్లు ఇటలీలో జరుగుతున్న సందర్భంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత సమంత నాగచైతన్య పెళ్లి జరిగింది. వీళ్లు కూడా నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు.

Advertisement

అయితే అమలు అఖిల్ కు త్వరగా పెళ్లి చేయాలని కంగారు పడుతుందట. ఇప్పటికే అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. దీంతో పెళ్లి వయసు కూడా దాటి పోతుందని అమల కంగారు పడుతుందట. అయితే నాగార్జున ముందు నాగచైతన్యకు పెళ్లి చేసి ఆ తర్వాత అఖిల్ కు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడట. అయితే అమలా మాత్రం చైతు పెళ్లితో సంబంధం లేకుండా, ముందు అఖిల్ పెళ్లి చేయాలని పట్టుబడుతుందట. ఈ విషయంలోనే అక్కినేని ఫ్యామిలీలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చైతన్య, అఖిల్ పెళ్లి చేయడం నాగార్జునకు పెద్ద సవాల్ గా మారాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి