Akkineni Amala Said About Acting With Nagarjuna
Akkineni Amala : రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోను చూడ ముచ్చటైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున – అమల. రీల్ లైఫ్‌లో హిట్ పెయిర్‌గా తెచ్చుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లోను అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నాగార్జున- అమల ఇద్దరు కలిసి చాలా సినిమాలు నటించగా, అందులో చాలావరకు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా కూడా నిలిచాయి. ఇక నాగార్జునతో పెళ్లి తర్వాత అమల చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఒకటి రెండు సినిమాలలో కనిపించిన అమల ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా నటించిన “ఒకే ఒక జీవితం” సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపించి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత విరామం రావడానికి కారణం ? ఏంటని ప్రశ్నించగా, దానికి సమాధానం ఇచ్చిన అమల.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. ప్రతి భాషలో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత ఇదే. అయితే గత ఐదేళ్లుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా నేనే చూసుకుంటున్నాను. నా మనసుకు హత్తుకునే కథ విన్నపుడు, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఒకే ఒక జీవితం అలా మనసుకు నచ్చిన కథ అని అమల పేర్కొన్నారు.
Akkineni Amala Said About Acting With Nagarjuna
ఇక నాగార్జునతో వెండితెరపై నటించే అవకాశం ఉందా అని అడగగా నో అని నిర్మొహమాటంగా చెప్పేసారు అమల. “ఇంట్లో ఎలాగో కలిసే ఉంటాం కదా తెరపై కూడా ఎందుకు” అంటూ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు అమల. ఈమో జంతు ప్రేమకురాలు కాగా, నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకోక ముందు నుంచి కూడా అమలకు జంతువులని చాలా ఇష్టపడేది. అఖిల్ పుట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్తకు బిజినెస్ లో సహాయం చేస్తూ టైం గడుపుతుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.