Home » Entertainment » Ali Fun With Anil Ravipudi
Entertainment

Anil Ravipudi : అనిల్ రావిపూడితో మూవీ తీయ‌నున్న‌ అలీ.. అడ్వాన్స్ కూడా తీసుకున్న స్టార్ డైరెక్టర్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: February 7, 2026, 5:20 pm
Advertisement

Anil Ravipudi : టాలీవుడ్ కామెడీ కింగ్ అలీ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల సందడే. తాజాగా శివాజీ – లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో అలీ చేసిన సరదా హంగామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని అలీ తనదైన శైలిలో ఆటపట్టిస్తూ స్టేజ్‌పై నవ్వుల పువ్వులు పూయించారు.వేదికపై మాట్లాడుతూ అలీ, “నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయవా?” అంటూ అనిల్ రావిపూడిని సరదాగా ప్రశ్నించారు. దానికి అనిల్ కూడా అదే టోన్‌లో “సరే సార్… మరి అడ్వాన్స్ ఇవ్వాలి కదా!” అని జవాబిచ్చారు. వెంటనే అలీ తన జేబులో నుంచి ఒక అమెరికన్ డాలర్ నోట్ తీసి అనిల్ చేతిలో పెట్టడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.

Advertisement

Anil Ravipudi : అనిల్ రావిపూడితో మూవీ తీయ‌నున్న‌ అలీ.. అడ్వాన్స్ కూడా తీసుకున్న స్టార్ డైరెక్టర్..!

Anil Ravipudi : డాల‌ర్ డీల్..

“ఇండియన్ కరెన్సీ కంటే డాలర్ బెటర్” అంటూ అలీ వేసిన పంచ్‌కు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. చివరికి అనిల్ రావిపూడి కూడా నవ్వుతూ “ఈ డాలర్ కోసం మీతో సినిమా చేస్తాను” అంటూ సరదాగా ప్రామిస్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అలీ డాలర్ ఇచ్చిన దృశ్యం చూసిన కమెడియన్ ధనరాజ్ కూడా “నాకూ కావాలి” అని అడగడంతో అలీ మరో డాలర్ ఇచ్చి అందరినీ మరింత నవ్వించారు. ఇదే సరదాలో హీరోయిన్ లయ కూడా “మరి నాకేం?” అని అడగగా, ఆమెకూ ఒక నోటు అందించారు. చివరికి యాంకర్ కూడా అడగడంతో స్టేజ్‌పైనే అలీ డాలర్ల పంపిణీ చేసి ఈ ఈవెంట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేశారు. ఈ డాలర్ ఎపిసోడ్ మొత్తం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది.

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే, శివాజీ – లయ లాంటి సీనియర్ నటులు చాలా కాలం తర్వాత జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ సినిమా ప్రతి కుటుంబం ఆస్వాదించేలా ఉంటుందని తెలిపారు. అనిల్ రావిపూడి కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా అలీ చేసిన ‘డాలర్ డీల్’ సరదా సంఘటనగా మొదలైనా, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యింది. నిజంగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో అలీ హీరోగా సినిమా వస్తుందేమో అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా, అలీ టైమింగ్ ఉంటే ఆ ఈవెంట్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం అన్న మాట మరోసారి నిజమైంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి