Home » Entertainment » Alia Bhatt Announces She Is Going To Be A Mother
Entertainment

Alia Bhatt : తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన అలియా భ‌ట్

Authored By
Sam C
The Telugu News | Updated on: June 27, 2022 6:02 pm
Advertisement

Alia Bhatt : బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భ‌ట్ షార్ట్ టైంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మ ఐదేళ్లుగా ప్రేమ‌లో ఉన్న‌ రణబీర్ క‌పూర్‌ని వివాహం చేసుకుంది. ఏప్రిల్ 14న వీళ్ల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కూడా ప్లాన్ చేయలేదు. ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అలా పెళ్లి చేసుకొని 3 నెలలైనా తిరక్కముందే తన ప్రెగ్నెన్సీ కన్ ఫర్మ్ చేసింది అలియా భట్. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు అలియా భట్‌ సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ ఫొటో షేర్‌ చేసిన ఆలియా..

Advertisement

‘మా బేబీ త్వరలో ఈ భూమి మెడకు రానుంది’ అని పేర్కొన్నారు. బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతోంది. వాణికపూర్, రకుల్ ప్రీత్, ప్రియాంక చోప్రా, టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్.. ఇలా చాలామంది ప్రముఖులు రణబీర్-అలియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాడీ సినిమాలు చేసింది అలియా. రణబీర్ తో కలిసి ఆమె చేసిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ 14న వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

Alia Bhatt announces she is going to be a mother

Advertisement

Alia Bhatt : గుడ్ న్యూస్..

రణ్‌బీర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పుస్తకమనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న రణ్‌బీర్‌-అలియా అభిమానులకు శుభవార్త చెప్పారు. అలియా భట్ సినిమాల విషయానికి వస్తే…. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ఆ తర్వాత ‘డియర్ జిందగీ, ‘హైవే’, ‘రాజీ’ మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన గంగూబాయి కతియావాడి ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి