Alia Bhatt does such things
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుసు కదా. తనకు పెళ్లయి ఒక బిడ్డకు కూడా ఇటీవల జన్మనిచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది అలియా భట్. బాలీవుడ్ లో తను స్టార్ హీరోయిన్. ఇప్పటికీ తనకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో అదరగొట్టేసింది అలియా భట్. పెళ్లయినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. తను నిజానికి గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. ఇండస్ట్రీలో తన ఫ్యామిలీ ఉన్నా కూడా కష్టపడి పైకొచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది అలియా భట్.
దర్శకధీరుడు రాజమౌళి కూడా అలియా భట్ నటనకు ఫిదా అయిపోయి.. తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయినా కూడా తన సినీ కెరీర్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 2022 లో టాప్ సెలబ్రిటీల లిస్టులో తను చోటు సంపాదించింది అంటే తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్.. ప్రస్తుతం తను ఒక బాధ్యతాయుతమైన బంధంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత తన జీవితమే చాలా మారిపోయిందట.
Alia Bhatt does such things
ఇదివరకు తను బాగా నిద్రపోయేదట. కానీ.. ఇప్పుడు మాత్రం తనకు నిద్రే కరువైందంటోంది అలియా. తనకు నిద్ర అంటే అంత ఇష్టమట. ఆదివారం ఎక్కువగా నిద్రపోయేదట. చివరకు చదువుకునే రోజుల్లో క్లాస్ రూమ్ లోనే ఎక్కువగా నిద్రపోయేదట అలియా భట్. క్లాస్ రూమ్ లో నిద్రపోవడం ఏంటంటూ టీచర్ తిడితే బాత్ రూమ్ కు వెళ్లి నిద్రపోయేదట అలియా భట్. గంటలు గంటలు అలాగే బాత్ రూమ్ లోనే నిద్రపోయేదట. అలా.. నిద్ర అంటే అంత పిచ్చి అట అలియాకు. కానీ.. ఇప్పుడు మాత్రం అలా నిద్ర రావడం లేదంటూ చెప్పుకొచ్చింది అలియా భట్.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.