Home » Entertainment » Allu Aravind Serious On Comedian Ali Talk Show
Entertainment

Comedian Ali : జగన్ కోసమే అల్లూ అరవింద్ ని కమెడియన్ ఆలీ రెచ్చగొడుతున్నాడా ?

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: October 6, 2022 11:47 pm
Advertisement

Comedian Ali : తానొక స్టార్ కమెడియన్ అయినా కూడా బుల్లితెర మీద ఓ స్పెషల్ చిట్ చాట్ షోతో అలరిస్తున్నారు సీనియర్ కమెడియ అలి. ఆయన చేస్తున్న అలితో సరదాగా షోకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా తన ప్రస్థానం కొనసాగించిన అలి తను చేసే స్పెషల్ ఇంటర్వ్యూస్ లో కూడా తనకు తెలిసిన కొన్ని విషయాలను ప్రస్థావిస్తూ ఆడియన్స్ ని అలరిస్తారు. ఒకప్పటి హీరోయిన్స్ ని.. ఒకప్పుడు క్రేజ్ ఉండి ఇప్పుడు వెండితెరకు దూరంగా ఉన్న కొందరిని అలి చేసే ఇంటర్వ్యూస్ చాలా క్రేజీగా ఉంటాయి. లేటెస్ట్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ షోలో పాల్గొన్నారు.

Advertisement

అలితో సరదాగా టాక్ షోలో అల్లు అరవింద్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోతోనే కావాల్సినంత బజ్ ఏర్పరిచారు. అల్లు రామలింగయ్య వారసుడిగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ ప్రస్థానం గురించి చర్చిస్తూ అల్లు అర్జున్ పిల్లలు ఎలా అల్లరిచేస్తారన్న విషయంపై కూడా డిస్కస్ చేశారు. అయితే ఈ ప్రోమోలో అల్లు అరవింద్ కొంత అసహనానికి గురయ్యారు. మెగా అల్లు వార్ గురించి అలి అడిగిన ప్రశ్న అల్లు అరవింద్ కి కోపాన్ని తెప్పించింది. తనకు కాంట్రవర్సీ ప్రశ్నలు లేవని చెప్పారని అల్లు అరవింద్ అనగా.. కాంట్రవర్సీ లేదు సర్ ప్రైజ్ ఉందని అన్నారని చెప్పారు. అయితే ప్రోమో కోసమే ఈ ఎడిటింగ్ అని తెలుస్తున్నా..

allu aravind serious on Comedian Ali talk show

Advertisement

మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరాన్ని ఎవరు కోరుతారన్నది ఇక్కడ పాయింట్ గా మారింది. ముఖ్యంగా జగన్ కోసమే అలి ఇలా అల్లు అరవింద్ ని రెచ్చగొడుతున్నారని చెబుతున్నారు. అయితే టాక్ షొలో ఇలాంటివి చాలా కామన్ అని చెప్పొచ్చు. ప్రోమో సీరియస్ గా కట్ చేసి దానికి సంబంధం లేకుండా ఎపిసోడ్ ఉంటుంది. మరి అల్లు అరవింద్ నిజంగానే సీరియస్ అయ్యారా లేక ప్రోమో కోసం అలా కట్ చేశారా అన్నది చూడాలి. అల్లు అరవింద్ ఇదివరకే మెగా అల్లు ఫ్యామిలీల ఇష్యూపై స్పందించారు. ప్రతి వీకెండ్ తామంతా కలిసి ఎంజాయ్ చేస్తామని.. పనిపాట లేని వారు రాసే రాతలని నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. రీసెంట్ గా అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ నాడు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారని తెలిసిందే. ఒకవేళ నిజంగానే వారి మధ్య గొడవ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అల్లు స్టూడియోస్ కి చిరు అటెండ్ అయ్యే వారు కాదు కదా అని కొందరు అంటున్నారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి