allu arjun about badrinath shoulder injury in sam jam
హీరోలకు స్టార్ స్టేటస్ అంత ఈజీగా రాదు.. వచ్చిన ఆ స్టార్డంను కాపాడుకోవడమూ అంత ఈజీ కాదు. అలా స్టార్ హీరోలు కొనసాగేందుకు ఎన్నో కష్టాలు భరిస్తారు. ఒళ్లు హూనం చేసుకుంటారు హీరోలు. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ కాళ్లు చేతులు మోకాళ్లు భుజాలకు గాయాలు చేసుకుంటారు. ప్రతీ సినిమాలో హీరోలకు ఏదో ఒక గాయం అవ్వడం పరిపాటే. ప్రస్తుతం అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు నిత్యం గాయాలు అవుతూనే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌కు గతంలో పెద్ద గాయమే అయిందట. తాజాగా ఈ విషయాన్ని సామ్ జామ్ షోలో బయట పెట్టేశాడు.
allu arjun about badrinath shoulder injury in sam jam
బద్రినాథ్ సమయంలో బన్నీకి భుజానికి ఓ గాయమైందట. ఆ సమయంలో ఆపరేషన్ లేకుండానే ఏదో చిన్నగా చికిత్స చేశారట. కానీ కొన్నాళ్లకు మాత్రం అది ఇంకా బాధించడం మొదలుపెట్టింది. అయితే ఈ సారి ఆస్ట్రేలియాలో చికిత్స నిమిత్తం వెళ్లారట. ఈ సారి కూడా ఆపరేషన్ లేకుండా ఏదైనా చికిత్స చేస్తారని బన్నీ అనుకున్నాడట. కానీ ఈ సారి మాత్రం పెద్ద షాక్ ఇచ్చారట. భుజాన్ని కోసేయాలని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
అయితే ఆ సమయంలో జులాయి సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడట. ఆపరేషన్ అయితే ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్‌ను అడిగితే.. సింపుల్‌గా ఆరేడు నెలలు అని చెప్పేశాడట. కానీ అప్పుడే జులాయి పనులు జరుగుతున్నాయని తరువాత చేసుకోవచ్చా? అని డాక్టర్‌ను అడిగితే కుదరదని చెప్పాడట. అలా భుజానికి ఆపరేషన్ అవ్వడంతో డ్యాన్సులు సరిగా చేయలేకపోయానని నాటి సంగతులు బన్నీ బయట పెట్టేశాడు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.