Home » Entertainment » Allu Arjun Emotional Speech In Pushpa Thanks Meet
Entertainment

Allu Arjun : సుకుమార్ లేకుంటే నా లైఫ్ వేరేలా ఉండేది.. కన్నీటి పర్యంతమైన అల్లు అర్జున్..

Authored By
mallesh
The Telugu News | Published on: December 28, 2021, 9:00 pm
Advertisement

Allu Arjun : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చి హ్యాట్రిక్ హిట్‌గా నిలిచింది పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్ సభ్యులు థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ చిత్రంలో ‘పుష్ప’రాజ్‌గా బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. మెగా అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో తమ హీరోను చూపించినందుకుగాను మెగా అభిమానులు సుకుమార్ కు థాంక్స్ చెప్తున్నారు.

Advertisement

ఈ సంగతులు అలా ఉంచితే.. ‘పుష్ప’ థాంక్స్ మీట్‌లో బన్నీ మాట్లాడుతూ.. తన లైఫ్ సుకుమార్ లేకపోతే వేరేలా ఉండేదని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.తన జీవితంలో తన తాత, తల్లిదండ్రులు, మెగాస్టార్ చిరంజీవి తర్వాత తాను రుణపడి ఉండాల్సిన వ్యక్తి సుకుమార్ అని చెప్పుకొచ్చాడు బన్నీ. ఈ క్రమంలోనే వేదికపైన మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు బన్నీ. తన జీవితంలో చాలా తక్కువ మందికి రుణపడి ఉంటానని అందులో సుకుమార్ ఒకరని మరో మారు బన్నీ స్పష్టం చేశారు. ఇక పుష్ప సినిమా వసూళ్ల పర్వం కొనసా..గుతోంది. బన్నీ, మూవీ యూనిట్ సభ్యులు సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

allu arjun emotional speech in pushpa thanks meet

Advertisement

Allu Arjun : బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’కు కలెక్షన్సే కలెక్షన్స్..

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో బన్నీ చిత్తూరు యాసలో సినిమాలో పోషించిన పాత్రకుగాను ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయి. ‘శ్రీవల్లి’గా బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన అభినయానికి కూడా ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు. థాంక్స్ మీట్‌లో మూవీ యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున థాంక్స్ చెప్పారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప2 సినిమాపైన ఉన్న అంచనాలను అందుకుంటామని చెప్పకనే చెప్పేశారు సుకుమార్.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి