Home » Entertainment » Allu Arjun Family Trip Photos
Entertainment

Allu Arjun : భార్య స్నేహా రెడ్డి ఎప్పటి నుంచో అడుగుతున్న ఆ కోరికని తీర్చడం కోసం అల్లు అర్జున్ అతిపెద్ద త్యాగం.. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 15, 2023, 2:01 pm
Advertisement

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ‘ పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడంతో వెంటనే కుటుంబంతో కలిసి చిన్న వెకేషన్ ప్లాన్ చేశాడు. ఇక బన్నీ భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి షార్ట్ ట్రిప్ కి వెళ్ళాడు. ప్రస్తుతం రాజస్థాన్ బార్వారా వెకేషన్ లో ఉన్నాడు. బర్వారాలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

Advertisement

Allu Arjun family trip photos

దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చాలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఫ్యామిలీతో చిన్న స్వీట్ బ్రేక్ అని క్యాప్షన్ పెట్టారు. ఇక అల్లు అర్జున్ ఈనెల చివరి ఆఖరిలో పుష్ప 2 సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొననున్నాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో పుష్ప 2 ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Advertisement

అలాగే ఈ సినిమాను దక్షిణాది భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అలాగే జపనీస్, రష్యన్ భాషలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. పుష్ప టు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించింది. రెండవ భాగంలో కూడా రష్మికనే కంటిన్యూ అవుతుంది. అలాగే విలన్ పాత్ర చేసిన అనసూయ కూడా పుష్ప 2లో కంటిన్యూ అవ్వబోతుందని సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి