Allu Arjun Important Decision About His Daughter
Allu Arjun : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో కలిసి తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కూతురితో బన్నీ చేసే రచ్చ మాములుగా ఉండదు. ఆమె అల్లరి అల్లు అర్జున్ తెగ ఎంజాయ్ చేస్తారు. అర్హతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేయడం సరదాగా ఫీల్ అవుతారు. తండ్రికి తగ్గట్లే అర్హకి ఎనర్జీ చాలా ఎక్కువ.ఇటీవల తండ్రి కొడుకులు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలో అర్హ వాళ్ళ నాన్నకు కొన్ని పరీక్షలు పెట్టింది. మొదటగా… గంగిగోవు పాలు గరిటడైనను చాలు? అని అడిగింది. అది పొడుపు కథ అని భావించిన అల్లు అర్జున్.. జున్ను అని ఆన్సర్ చెప్పాడు.
నీకెలా తెలుసు అని అర్హ అడిగింది. నాకు తెలుసురా బే అని బన్నీ అన్నారు. నెక్స్ట్ ఓ క్రిటికల్ పరీక్ష పెట్టింది. ‘ఐదు నల్ల లారీలు ఐదు తెల్ల లారీలు’ అనే వాఖ్యాన్ని తప్పు పోకుండా గబగబా చెప్పాలంది. ఈ పరీక్షలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఆ పదాలను త్వర త్వరగా పలకలేకపోయారు. మొత్తానికి కూతురితో మాత్రం సరదాగా గడిపాడు. అయితే బన్నీ కూతురు శాకుంతలం అనే చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆమె పర్ ఫర్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు.
Allu Arjun Important Decision About His Daughter
అయితే శాకుంతలం చిత్రం తర్వాత బన్నీ కూతురు ఏదైన సినిమాలలో నటిస్తుందా అనే ఆసక్తి అందరిలో ఉండగా, బన్నీ మాత్రం తన పిల్లలను ఇప్పట్లో సినిమాలలో నటింపజేయకూడదు అని అనుకుంటున్నాడట. వాళ్ల చదువులు అయిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప గా థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు ఆలు అర్జున్ పేరు దేశాలు దాటి వినిపిస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప పాటలే.. పుష్ప డైలాగులే.. అంతలా జనాల్లోకి దూసుకెళ్లింది ఈ సినిమా. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.