Allu Arjun : రాఖీ భాయ్‌ని కొట్టగలిగేది ఒక్క పుష్ప రాజ్ మాత్రమేనా..? అంటే అవును అల్లు అర్జున్ మాత్రమే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కలెక్షన్స్ రాబటిన సినిమాగా అందరూ ఆర్ఆర్ఆర్ అని చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పుడు అసలు టాక్ వేరేలా వినిపిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్ 2 బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ వసూళ్ళను రాబట్టిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ 2 రూ 1000 కోట్ల మార్క్‌ను దాట్టిందని టాక్.
హిందీలో కూడా ఈ సినిమా అనూహ్యంగా రూ. 430 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టి బాలీవుడ్ మేకర్స్‌ను, హీరోలకు సవాళ్ళు విసిరింది. అయితే, దీని తర్వాత వచ్చిన ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు ఒక్క తెలుగులో మాత్రమే రిలీజైయ్యాయి. మిగతా భాషలలో విడుదల చేయలేకపోయారు. అయితే, వచ్చే ఏడాది రానున్న సినిమాలలో కేజీఎఫ్ 2 రికార్డ్స్‌ను బ్రేక్ చేయగలిగే సినిమా పుష్ప 2 అని ఆ సత్తా ఒక్క అల్లు అర్జున్ కు మాత్రమే ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు హిందీ బెల్ట్‌లో ఫ్లాప్‌గా నిలిచాయి.
కాబట్టి నెక్స్ట్ సినిమా ప్రభాస్ నుంచి వచ్చినా వసూళ్ళ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చెప్పలేని పరిస్థితి. చరణ్ నటిస్తున్న # RC 15 గురించి ఇప్పుడే మాట్లాడటానికి లేదు. అందుకే, ఏ రకంగా చూసినా కూడా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న పుష్ప సీక్వెల్ మూవీకే కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉంటుందని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం పెద్దగా పబ్లిసిటీ చేయకపోయినా పుష్ప పార్ట్ 1 హిందీలో భారీగా వసూళ్ళు రాబట్టడమే. చూడాలి మరి పుష్ప సీక్వెల్ ఎలాంటి సంచనం సృష్టిస్తుందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.