Home » Entertainment » Allu Arjun Pushpa On 13th August 2021
Entertainment

pushpa : ఎవ్వరూ ఊహించని అప్డేట్.. ‘పుష్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 28, 2021, 12:08 pm
Advertisement

pushpa :  మామూలుగా సుకుమార్ సినిమాలంటే అందరికీ ఓ అంచనా ఉంటుంది. సినిమా డేట్ విషయంలో ఎవ్వరికీ ఓ క్లారిటీ ఉండదు. ఎందుకంటే సుకుమార్‌కు ఎప్పుడు పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు సినిమాను ఓకే చేస్తాడు. ఒక్కో సీన్‌నే ఎన్నో సార్లు తీస్తుంటాడు. అలా సుకుమార్‌ సినిమాల విడుదలపై ఎన్నడూ ఓ క్లారిటీ ఉండదు. కానీ పుష్ప విషయంలో మాత్రం ఆ పద్దతి మారింది. ముందే విడుదల తేదీని ఫిక్స్ చేసేశారు. తాజాగా ఈ మేరకు ఓ అప్డేట్‌ను కూడా ఇచ్చారు.

Advertisement

Allu arjun Pushpa on 13th august 2021

అందరూ ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారని, విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుంటూ బెర్త్‌లు కన్ఫామ్ చేసుకుంటున్నారని మైత్రీ మూవీస్ ముందుగానే జాగ్రత్తలు పడింది. అందుకే ఇలా చెప్పా పెట్టకుండా ఓ అప్డేట్‌ను ఇచ్చింది. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలానే పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఆ స్టిల్, పోస్టర్, రిలీజ్ డేట్ ఇలా అన్నీ కలిసి బన్నీ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ అప్డేట్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Advertisement

పుష్ప సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ అదరొగొట్టేసింది. గంధపు చక్కల స్మగ్లర్ల గ్యాంగ్‌తో బన్నీ ఉండటం.. ఆ గొడ్డలి పట్టుకున్ని ఉన్న బన్నీ కసిగా చూడటం ఇలా అన్నీ కలిసి విజువల్ ట్రీట్‌లా అనిపిస్తోంది. పుష్ప సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టు ప్రకటించారు. ఇలా మొత్తానికి ముందే డేట్‌ను ప్రకటించింది.. అందరినీ సైడ్ అవ్వమని పరోక్షంగా కౌంటర్ వేసినట్టున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి