Home » Entertainment » Allu Arjun Sneha Reddy Before Love Story
Entertainment

Allu Arjun : స్నేహారెడ్డి కంటే ముందర.. ‘అలా ఆ హీరోయిన్‌తో బన్నీ ప్రేమాయణం’..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 22, 2021, 7:15 am
Advertisement

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోగా బన్నీ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డలను తిరగరాసింది. బన్నీ ప్రజెంట్ సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.బన్నీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. స్నేహారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. టీఆర్ఎస్ కీలక నేత ప్రభాకర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డి .. తండ్రి కాలేజ్‌లకు చైర్ పర్సన్‌గా వ్యవహరించారు.

Advertisement

Allu Arjun : ఆ హీరోయిన్‌కు మ్యారేజ్ అయిందని బాధపడిపోయిన బన్నీ..

ఇకపోతే బన్నీ ప్రస్తుతం తన భార్య స్నేహారెడ్డి, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌లతో ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కాగా, బన్నీ తన లైఫ్‌లో స్నేహారెడ్డికి ముందరే ఇంకో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపాడు. ఆ హీరోయిన్‌ను బన్నీ విపరీతంగా ప్రేమించాడు.ఆమెకు పెళ్లి అయినపుడు అల్లు అర్జున్ చాలా బాధపడిపోయాడు.

Advertisement

ఆమె ఎవరంటే..అల్లు అర్జున్ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు. మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యారాయ్.. ఐశ్వర్యారాయ్‌ను అల్లు అర్జున్ విపరీతంగా ప్రేమించాడట. ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇకపోతే ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నపుడు తాను చాలా బాధపడినట్లు బన్నీ పేర్కొన్నాడు. ఈ సంగతులు అలా ఉంచితే..

బన్నీ ప్రజెంట్ ‘పుష్ప’ ఫిల్మ్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాల తర్వాత సుకుమార్-బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’లో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నాడు. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ సినిమాలో ‘పుష్ప పార్ట్ -1 రైజ్ ఆఫ్ పుష్ప’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇందులో ‘పుష్ప’ రాజ్‌గా బన్నీ.. బన్నీకి జోడీగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన కనిపించనుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి