Home » Entertainment » Allu Arjuns New Film Title Is Raaka
Entertainment

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ టైటిల్ ఇదే… ఊహించని లుక్‌లో బన్నీ..!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Updated on: April 8, 2026 2:30 pm
Advertisement

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ సర్ప్రైజ్ ఇచ్చింది. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీకి ‘రాకా’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు మేకర్స్ ప్రీ-లుక్ విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు. అయితే బర్త్‌డే రోజునే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘రాకా’ అనే పదానికి చంద్రుడు అనే అర్థం ఉండటం విశేషం. టైటిల్‌తోనే సినిమా కథలో ఉన్న ప్రత్యేకతను సూచించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పాన్-ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నట్టు సమాచారం.

Advertisement

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ టైటిల్ ఇదే… ఊహించని లుక్‌లో బన్నీ..!

Allu Arjun : అల్లు అర్జున్ లుక్ వైరల్

ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అరగుండుతో, పొడవాటి గోర్లు, భయానకమైన స్టైలింగ్‌తో ఆయన కనిపించడం విశేషం. ఒకరకంగా ఈ లుక్‌లో విలనిజం షేడ్స్ కనిపిస్తున్నాయి. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడిలా డిజైన్ చేసిన ఈ గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ సినిమాల పోస్టర్లను తలపించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని ఎంత భిన్నంగా తెరకెక్కిస్తున్నాడో ఈ ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. కొంతవరకు శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమాలోని విక్రం పాత్ర లుక్‌తో పోలికలు ఉన్నప్పటికీ ఇందులో మరింత కొత్తదనం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Advertisement

Allu Arjun : భారీ కాస్టింగ్, గ్లోబల్ అంచనాలు

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీమణులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ అయినది దీపిక మాత్రమే. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం. ‘పుష్ప’ ఫ్రాంచైజ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ‘రాకా’ సినిమాతో మరింత గ్లోబల్ స్టార్‌గా ఎదగనున్నాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు అట్లీ ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ‘రాకా’ చిత్రం టాలీవుడ్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

 

 

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి