Home » Entertainment » Allu Arvind Owns The Bhimla Nayak Rights
Entertainment

Bheemla Nayak : అల్లు అరవింద్ చేతికి భీమ్లా నాయక్ మూవీ?.. ఫ్యాన్సీ రేటుకే..

Authored By
mallesh
The Telugu News | Published on: February 20, 2022, 4:00 pm
Advertisement

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన భీమ్లానాయక్ మూవీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్ తో పాటు ఆహా సైతం దక్కించుకున్నదని టాక్. ఇందులో దగ్గుపాటి రానా సైతం కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 22న ప్రీ రిలీజ్ వేడుకలను సైతం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా ప్రొడ్యూసర్లకు మంచి లాభాల‌ను తెచ్చి పెడుతోంది.

Advertisement

థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా దాదాపుగా రూ.90 కోట్లు పైగానే వచ్చాయని సమాచారం. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ చూసుకుంటే శాటిలైట్‌, డిజిట‌ల్ ఇతర హ‌క్కుల‌న్నింటి ద్వారా దాదాపుగా రూ.70 కోట్లు వచ్చినట్టు టాక్. తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను రెండు సంస్థలు దక్కించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అందులో డిస్నీ హాట్ స్టార్‌తో పాటు తెలుగు ఓటీటీ ఆహా సైతం ఉందట.తెలుగులో బాడా నిర్మాతల్లో ఒకరు అల్లుఅర్జున్.. దీనికి తోడు ఆహా అనే ఓటీటీ సంస్థను సైతం రన్ చేస్తున్నారు. ఇక ఆయన మెగా ఫ్యామిలీకి చెందిన వాడు కావడంతో భీమ్లానాయక్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకే

allu arvind owns the bhimla nayak rights

Advertisement

Bheemla Nayak : ఫ్యాన్సీ రేటుకే..

ఆహాకు ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక ట్రైలర్ ను సైతం ఈ నెల 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. మరి రిలీజ్ కు ముందే ఇంత వసూలు చేస్తున్న భీమ్లానాయక్.. రిలీజ్ తర్వాత ఎన్ని కలక్షన్స్ రాబడుతుందో చూడాలి. బాక్సాఫిస్ వద్ద ఈ మూవీ కలక్షన్ల సునామీని సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి