Home » Entertainment » Allu Sneha Reddy First Time Chit Chat With Fans
Entertainment

Allu Sneha Reddy : ఫస్ట్ టైం ఆ పని చేసిన అల్లు అర్జున్ భార్య.. అన్నీ బయటపెట్టేసిన అల్లు స్నేహారెడ్డి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 25, 2022, 1:30 pm
Advertisement

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య అయితే మరీ హల్చల్ చేస్తోంది. అందాల ఆరబోతలో హీరోయిన్‌లతో పోటీ పడుతోంది. అదిరిపోయే డ్రెస్సులు వేస్తోంది. వెరైటీ వెరైటీ డిజైనర్ డ్రెస్సులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మొత్తానికి బన్నీ భార్యకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని అందరికీ తెలిసిందే.స్టార్ హీరోల భార్యల్లో అల్లు స్నేహారెడ్డి టాప్. ఆమెకు ఉన్న ఇన్ స్టా గ్రాం ఫాలోవర్ల సంఖ్య మిగతా సెలెబ్రిటీల సతీమణులకన్నా ఎక్కువే.

Advertisement

బన్నీకి సంబంధించిన విషయాలు, పిల్లల అప్డేట్లు ఇస్తుండటంతో స్నేహారెడ్డికి ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. రోజురోజుకూ ఆమెకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉంటారు. అయితే తాజాగా మొదటి సారిగా అని కూడా చెప్పొచ్చు. అల్లు స్నేహారెడ్డి నెట్టింట్లో చిట్ చాట్ చేసింది.అల్లు స్నేహారెడ్డి తన ఇన్ స్టాగ్రాంలో ఆస్క్ మీ ఎనీ థింగ్ అంటూ పెట్టేసింది. ఇక మొదటి సారిగా అల్లు స్నేహారెడ్డి ఇలా చేయడంతో అభిమానులు దుమ్ములేపేశారు.

Allu Sneha Reddy First Time Chit Chat With Fans

Advertisement

కానీ స్నేహారెడ్డి మాత్రం కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పినట్టుంది. ఇందులో కొన్ని సీక్రెట్లను బయటపెట్టేసింది. బన్నీకి ఇష్టమైన ఫుడ్, ఆమెకు ఇష్టమైన కలర్, ఫోన్‌లోని లేటెస్ట్ ఫోటోలు ఇలా అన్నీ బయటపెట్టేసింది.బన్నీకి బిర్యానీ అంటే ఇష్టమట, తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, అలాగే ప్రదేశాల్లో లండన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్య సెర్బియాలో సందడి చేసిన ఫోటోలను కూడా స్నేహారెడ్డి చూపించింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి