Home » Entertainment » Amala Paul Crazy News About Marriage
Entertainment

Amala Paul : రెండో పెళ్లిపై త్వ‌ర‌లోనే చెబుతానంటూ క్రేజీ కామెంట్స్ చేసిన‌ అమ‌లాపాల్‌

Authored By
Sam C
The Telugu News | Published on: July 8, 2022, 8:20 am
Advertisement

Amala paul : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో యూత్ లో తనకుంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. అందాల హీరోయిన్ గా అభిమానుల గుండెల్లో కాసంతా చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించినా సోషల్ మీడియా లో మాత్రం రచ్చ చేస్తోంది. ఏ హీరో సరసన నటించినా అద్భుతమైన కెమిస్ట్రీని చూపించగల నటి అమలాపాల్. సరైన అవకాశాలు వచ్చినా..

Advertisement

సాలిడ్ హిట్ మాత్రం ఈ బ్యూటీ పడలేదు. కానీ పెర్ఫామెన్స్, గ్లామర్ విషయంలో అమలా పాల్ కు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్‌ను 2014లో పెళ్లి చేసుకుని మూడేళ్లకే విడాకులిచ్చిన నటి.. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అమలాపాల్ అభిమాని.. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?’ అని ప్రశ్నించడంతో రిప్లై ఇచ్చింది. ఇప్పుడైతే మళ్లీ మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు.

amala paul crazy news about marriage

Advertisement

Amala Paul  : సీక్రెట్ రివీల్

నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకుని, ఉన్నతంగా మార్చుకునే పనిలో నిమగ్నమయ్యానంటూ అభిమానికి తెలిపింది. తాను మళ్లీ చేసుకోవాలనుకుంటే.. చేసుకోబోయేవాడికి.. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో త్వరలో వెల్లడిస్తానని అమలాపాల్ అభిమానులకు మెస్సేజ్ ఇచ్చింది. దీంతో అమ‌లా పాల్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వ్య‌క్తిని కోరుకుంటుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. అటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ అమలాపాల్ నిర్మోహమాటంగా నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. సోష‌ల్ మీడియాలోను కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి