Home » Entertainment » Amala Paul Says My Husband Does Not Know Am Actor
Entertainment

Amala Paul : నా భ‌ర్తకి నేను హీరోయిన్ అనే విష‌యం తెలియ‌దు అంటూ బాంబ్ పేల్చిన అమ‌లాపాల్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 9, 2025 6:31 pm
Advertisement

Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమ‌లాపాల్‌. తెలుగులో ఆరు సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. నటనతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది.

Advertisement

Amala Paul : నా భ‌ర్తకి నేను హీరోయిన్ అనే విష‌యం తెలియ‌దు అంటూ బాంబ్ పేల్చిన అమ‌లాపాల్..!

Amala Paul సీక్రెట్‌..

తాజాగా అమ‌లాపాల్ త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాన్ని పంచుకుంది. తన భర్త జగత్ దేసాయిని డేటింగ్ చేస్తున్న సమయంలో తాను ఒక నటినని అతనికి తెలియదని ఆమె చెప్పారు. నేను కేవలం కేరళకు చెందిన అమ్మాయినని మాత్రమే అతనికి చెప్పాను. అతను ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూడడు. నేను నటినని కూడా అతనికి చెప్పలేదు. కేవలం నా వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మాత్రమే అతనికి చూపించాను” అని అన్నారు.

Advertisement

అయితే నేను గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలో తానకు నేను హీరోయిన్ అని తెలిసింది. దీంతో నేను గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు, అతను ఒక్కొక్కటిగా నా సినిమాలు చూడటం ప్రారంభించాడు. అతనికి అవార్డుల కార్యక్రమాలు చూడటమంటే చాలా ఇష్టం. నేను అవార్డులు తీసుకోవడం, రెడ్ కార్పెట్‌పై నడవడం, స్టేజ్‌పై మాట్లాడటం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు అంటూ అమ‌లాపాల్ చెప్పుకోచ్చింది. ద‌ర్శ‌కుడి విజ‌య్‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం 2023లో జగత్ దేశాయిని పెళ్లి చేసుకుంది అమలాపాల్.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి