Amala Paul white saree looks viral
Amala Paul : అమలాపాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మలయాళీ బ్యూటీ అయినప్పటికీ ఒకప్పుడు తెలుగులో తెగ సందడి చేసింది. నటనతో పాటు గ్లామర్‌తోను ఆకట్టుకునే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పటి వరకు చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించింది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ అందాల ముద్దుగుమ్మ చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా తెల్లచీర, మల్లెపూలు ధరించి.. ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొడుతోంది. కెరళలో జరిపే ప్రతిష్ఠాత్మకమైన పండుగ ‘ఓనమ్’సందర్భంగా అమలాపాల్ ఇలా క్యూట్‌గా దర్శనమిచ్చి అందరి మతులు పోగొడుతుంది. సాధారణంగా అమలాపాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఏదోలా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా వారితో పంచుకుంటుంది. సినీ విశేషాలనూ పంచుకుంటుంది. ఒక్కోసారి చాలా బోల్డ్‌గా కనిపిస్తూనే అప్పుడప్పుడ ఇలా ట్రెడిషనల్ లుక్ లోను సందడి చేస్తుంటుంది.
Amala Paul white saree looks viral
2017లో విజయ్ నుండి విడిపోయిన తర్వాత అమలాపాల్ సింగిల్ గానే ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. ఈ మధ్యలో కొన్ని రోజులు అమలాపాల్ సింగర్ భవీందర్ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు, వీరిద్దరికి పెళ్లి అయినట్టు వార్తలు వచ్చినా అమలాపాల్ అలాంటివేం లేవని కొట్టిపారేసింది. కాని ఇప్పుడు భవీందర్ కోర్టులో తనకి, అమలాపాల్ కి పెళ్లి జరిగిందని చెప్పడంతో ఆంతా ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్ ఎవరికీ తెలీకుండా రెండో పెళ్లి చేసుకుందా? దాంట్లో కూడా విబేధాలు వచ్చి భవీందర్ తో విడిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వార్తలపై అమలాపాల్ మాత్రం స్పందించలేదు.
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
This website uses cookies.