
Ananya Nagalla : "లీసా" నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది హీరోయిన్ అనన్య నాగళ్ల..!
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ “లీసా”. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. సౌజన్య సతీష్ రెడ్డి మాసం కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. డీవోపీ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. లీసా సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వ వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ AM.Reddy మాట్లాడుతూ – లీసా మూవీ పోస్టర్ చూస్తుంటేనే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది. అనన్య నాగళ్ల ఈ మూవీలో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.ఆమెకు ఈ మూవీ మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. లీసా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. డా. నిరంజన్ మాట్లాడుతూ- వెంకట్ నాకు మంచి మిత్రుడు. చాలాకాలంగా తెలుసు. వెంకట్ ఇప్పటికి మూడు చిత్రాలు చేశారు. ఈ సినిమా కూడా ఆయనకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా.అన్నారు.ప్రొడక్షన్ డిజైనర్ తుమ్మల మధు మాట్లాడుతూ- లీసా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది. అనన్య నాగళ్లను చూడగానే వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది.ఈ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకొస్తుంది. లీసా చిత్రం విజయవంతం కావాలి. ప్రొడ్యూసర్స్ కు లాభాలు తీసుకురావాలి. అప్పుడే వారు మరిన్ని మంచి మూవీస్ చేయగలరు.అన్నారు.
Ananya Nagalla : “లీసా” నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది హీరోయిన్ అనన్య నాగళ్ల..!
నటి జాను వర్మ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఈ మూవీ సెట్ లో అడుగుపెట్టలేదు. థర్డ్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాను. లీసా చిత్రంలో ఒక మంచి రూల్ లో మీ ముందుకు రాబోతున్నా.అన్నారు.నటుడు యాదమ్మ రాజు మాట్లాడుతూ- లీసా సినిమాలో నేను డ్రైవర్ క్యారెక్టర్ లో నటిస్తున్నా. ఈ సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది. మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – వెంకట్ దుగ్గిరెడ్డి గారు సినిమా మీద ప్యాషన్ తో అమెరికా నుంచి వచ్చి మూవీస్ చేస్తున్నారు.ఆయన చేస్తున్న పాంచాలీ పంచభతృక చిత్రంలోనూ నేను నటిస్తున్నాను.ఈ సినిమాను మేము త్వరగా కంప్లీట్ చేశామంటే అందుకు డీవోపీ సతీష్ రెడ్డి మాసం గారు కారణం. పొట్టేల్ సినిమాలో అనన్యనాగళ్ల నటన నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి.అన్నారు.దర్శకుడు కమల్ రాజ్ మాట్లాడుతూ- డీవోపీగా రైటర్ గా నా ఫ్రెండ్ సతీష్ రెడ్డి మాసం సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నాడు.ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆయన చెప్పినప్పుడు ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగింది. లీసా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
దర్శకుడు గంగా సప్తశిఖర మాట్లాడుతూ – లీసా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రామిసింగ్ గా ఉంది.పోస్టర్ తోనే ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. సతీష్ రెడ్డి పని రాక్షసుడు. ఆయన చేతిలో సినిమా పడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అనన్యకు ఈ సినిమా కూడా అవార్డ్స్ తెచ్చిపెట్టాలి. అన్నారు.దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ – లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్ లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్ కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య పర్ ఫార్మెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది.ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్ గా నిలిచిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అన్నారు.నిర్మాత రామకృష్ణ ఐలా మాట్లాడుతూ – వెంకట్ దుగ్గిరెడ్డి నాకు మంచి మిత్రులు. ఆయన, సతీష్ రెడ్డి మాసం గారి ద్వారా నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. లీసా స్టోరీ విన్న తర్వాత యూఎస్ నుంచి వచ్చి ఏదో ఒక మూవీ చేసి వెళ్లిపోతాం అని అనిపించలేదు.ఇదొక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది.ఈ స్క్రిప్ట్ కు అనన్య పర్పెక్ట్ కాస్టింగ్ . ఆమె నటించిన గత చిత్రాలు చూశాను. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా మెప్పించగలదు.డైరెక్టర్ జవహర్ లాల్ రాజు ఈ చిత్రాన్ని అమేజింగ్ గా తెరకెక్కించాడు.లీసా సినిమా మేము మరిన్ని మంచి మూవీస్ చేసే విజయాన్ని ఇస్తుందని నమ్ముతున్నాం.అన్నారు.
నటుడు, నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమాకు కర్త కర్మ క్రియ సతీష్ రెడ్డి గారే. నేనుఈ చిత్రానికిప్రొడ్యూసర్ గానేకాదు ఒక మంచి రోల్ చేశాను. నా సీన్స్ కు చాలా టేక్స్ చేయించారు సతీష్ రెడ్డి గారు.మీకు నటుడిగా పేరు రావాలి కదా అనేవారు.నేను ఆయన చెప్పినట్లు నటించాను.అనన్య ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేసింది. రాత్రి 2 గంటలకు కూడా షూటింగ్ కు ఎనర్జిటిక్ గా రెడీ అయ్యేది. మేమంతా అలసిపోయేవాళ్లం. లీసా సినిమా హిట్ అయితే మాకు ఒక సినిమా ఫ్రీగా చేసి పెడతా అని చెప్పింది. లీసా చిత్రాన్ని డైరెక్టర్ రాజు అద్భుతంగా తెరకెక్కించాడు. మీరు ఒక్కసారి చూస్తే చాలు మా మూవీని హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. అన్నారు.నటుడు కిషోర్ దాస్ మాట్లాడుతూ – సినిమా అంటే వినోదాన్ని అందించే గొప్ప మాధ్యమం. మనం సినిమాను గౌరవించాలి. లీసా సినిమా మీరంతా కోరుకునే వినోదాన్ని వందశాతం అందిస్తుంది.ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ లో మీ ముందుకు రాబోతున్నా. అన్నారు.
స్క్రీన్ ప్లే, డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – లీసా సినిమాను ప్రేక్షకులు,రివ్యూ రైటర్స్,మీమర్స్..ఇలా ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తీశాం. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక బ్యాంగ్ ఉంటుంది. థియేటర్స్ లో ఆ సర్ ప్రైజ్ లను ఎంజాయ్ చేస్తారు.అనన్య కోసం మనం ఏ స్క్రిప్ట్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ జానర్ స్క్రిప్ట్ అయినా ఆమె పర్పెక్ట్ గా సెట్ అవుతారు.ఈ సినిమాను ఇంత ఫాస్ట్ గా అనుకున్న బడ్జెట్ లో చేశామంటే అందుకు అనన్య ఇచ్చిన సపోర్ట్ కారణం. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ తమ మూవీ అనుకుని పనిచేశారు. దర్శకుడు జవహర్ లాల్ రాజు మిలిటరీ డిసిప్లెన్ తో వర్క్ చేశాడు. కొంత బడ్జెట్ పెరిగినా మా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు. లీసా తో మీ అందరికీ నచ్చే ఒక మంచి మూవీ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ – నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా ..అందులో నేను చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటాను.కొత్తగా, డిఫరెంట్ గా ఉంటేనే ఆ మూవీ అంగీకరిస్తాను. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదు అనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా ఆ ఫ్రెష్ నెస్ ను ఫీలయ్యా. హీరోయిన్స్ గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు గారు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి గారు బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. గతంలో నేను నటించిన ఏ చిత్రంలోని విజువల్స్ కోసం కూడా ఇంతగా ఎగ్జైట్ కాలేదు. ఆయన క్యాప్చర్ చేసిన కొన్ని సీన్స్ చూస్తుంటే ఇంకా వర్క్ చేయాలనే ఇన్స్ పిరేషన్ కలిగింది. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.ఆ నమ్మకం నాకు ఉంది. అన్నారు.
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
This website uses cookies.