Home » Entertainment » Ananya Nagalla Beautiful Looks Viral
Entertainment

Ananya Nagalla : పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే .. భయంకరమైన ఆన్సర్ ఇచ్చిన అనన్య నాగళ్ళ !

Authored By
Sam C
The Telugu News | Published on: October 3, 2022, 8:00 pm
Advertisement

Ananya Nagalla: ఇటీవ‌ల చాలా మంది ముద్దుగుమ్మ‌లు పెళ్లిళ్లు చేసుకునేందుకు తెగ ఆస‌క్తి చూపుతున్నారు. ఇక కొంద‌రు భామ‌ల‌కి సంబంధించి పెళ్లి వార్త‌లు నెట్టింట ఏ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త రెండు రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ అన‌న్య నాగ‌ళ్ల పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. ఈ పుకార్ల‌పై ఆ అమ్మ‌డు అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Advertisement

అనన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్త నెట్టింట వైరల్‌ అయింది. అంతేకాదు వరుడి తాలూకు వివరాలపై పరోక్షంగా హింట్స్ కూడా ఇచ్చారు. ఓ బడా నిర్మాత రెండో కుమారుడితో అనన్య ప్రేమాయణం సాగుతోందని, ఈ ఇద్దరూ అతిత్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారని ప్ర‌చారాలు జ‌రిగాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై స్ప్రెడ్ అవుతున్న వార్తలపై అనన్య నాగళ్ళ స్పందించింది. నా కోసం పెళ్లి కొడుకుని వెతికినందుకు ధన్యవాదాలు అంటూ కాస్త వెటకారంగా రియాక్ట్ అయింది అనన్య నాగళ్ళ.తనకు పెళ్లికొడుకును చూసినందుకు అందరికీ థ్యాంక్స్.. ఇక పెళ్లి ఎప్పుడు, ఎక్కడో కూడా చెబితే తన పెళ్లికి తాను వస్తానంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది ఈ బ్యూటీ.

ananya nagalla beautiful looks viral

Advertisement

Ananya Nagalla :అన‌న్య క్లారిటీ..

అమ్మ‌డి కామెంట్‌తో తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనని ఇలా చెప్పేసింది ఈ బ్యూటీ. ఏదేమైనా సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై అభిమానులకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని అనన్య ఈ విధంగా కామెంట్ చేసింది.పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అనన్య నాగళ్ళ పలు క్రేజీ ప్రాజెక్టులలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక ఇటీవలే తను తమిళ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి ర‌చ్చ మాములుగా ఉండదు. ప‌రువాల‌తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి