Anasuya Bharadwaj : రాత్రి పూట జబర్దస్త్ షూటింగ్.. సింగర్ మనోపై అనసూయ ఫోకస్!
Anasuya Bharadwaj : జబర్దస్త్ షూటింగ్‌లు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్‌ల మాదిరి బుల్లితెర షో షూటింగ్‌లు జరుగవు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటలు..లేద తొమ్మిది గంటలు అనే ఫార్మూలా సినిమాలకు పనికొస్తాయి. కానీ బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు, స్పెషల్ ఈవెంట్లు అంటే మాత్రం నైట్ అవుట్ చేయాల్సిందే. ఒకరోజు మొత్తం లేదా.. రెండు రోజులు మూడు రోజులు ఇలా ఏకధాటిగా షూటింగ్ చేస్తూనే ఉంటారు.
Anasuya Bharadwaj On Mano Singing In Jabardasth
అలా షూటింగ్ చేసిన సమయంలోనే రెండు మూడు ఎపిసోడ్‌లను కానిచ్చేస్తుంటారు. అలా నెలకు రెండు మూడు షెడ్యూల్‌లో షూటింగ్‌లు చేస్తే దాదాపు ఆరేడు ఎపిసోడ్‌లను కవర్ చేసేస్తారట. అలా నిన్న కూడా షూటింగ్‌ను జరిపారు. ఇక నిన్న కృష్ణాష్టమి అయినా కూడా సరే షూటింగ్‌లు జరిపారట. ఈ విషయాన్ని అనసూయ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ షూటింగ్‌లు, అక్కడి వాతావరణం, సెట్, బిహేండ్ సీన్స్ అన్నీ కూడా అనసూయ చూపించేసింది.
Anasuya Bharadwaj On Mano Singing In Jabardasth
Anasuya Bharadwaj : రాత్రి పూట జబర్దస్త్ షూటింగ్.. సింగర్ మనోపై అనసూయ ఫోకస్!
కృష్ణాష్టమి సందర్భంగా నిన్న మనో అద్భుతమైన పాట పాడేశాడు. కృష్ణుడు, యశోదల బంధాన్ని తెలుపుతూ మనో పాడిన ఆపాటకు అందరూ ఫిదా అయ్యారు. ఇక రోజా, అనసూయ అయితే మనోను కెమెరాలో బంధించేశారు. రోజా పక్కనే ఉండి మరీ కెమెరాలో రికార్డ్ చేసింది.
Anasuya Bharadwaj On Mano Singing In Jabardasth
ఇక అనసూయ అయితే తన స్థానంలో కూర్చునే.. మనో మీద ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం మనో గారు పాట పాడుతున్నారు అని అనసూయ అప్డేట్ ఇచ్చేసింది. మొత్తానికి మనో గాత్రానికి అందరూ ఫిదా అయ్యారట
