Home » Entertainment » Anasuya Bharadwaj Serious On Media And Youtube Channels
Entertainment

Anasuya Bharadwaj : కోర్టుకు వెళ్తా.. వాళ్ల‌పై అనసూయ ఫైర్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 13, 2021, 8:40 am
Advertisement

Anasuya Bharadwaj  : అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఆమె చేసే రచ్చకు తగ్గట్టుగానే నెగెటివిటీ ఉంటుంది. ఆమె చేసే కామెంట్లు, వేసే బట్టలకు నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. ఇక ప్రతీసారి కేసులు వేస్తాను అంటూ నెటిజన్లు, మీడియాను భయపెట్టడం కూడా అనసూయకు పరిపాటే అయింది. పాజిటివ్ కామెంట్లకు పొంగిపోయే అనసూయ.. నెగెటివ్ కామెంట్లను మాత్రం తీసుకోలేకపోతోంది. అయితే మరోసారి మీడియా మీద అనసూయ మండిపడింది.

Advertisement

Advertisement

Anasuya Bharadwaj Serious On Media And Youtube Channels

Advertisement


మా ఎన్నికల్లో అనసూయకు చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు మా ఎన్నికల ఫలితాల్లో అనసూయ గెలిచినట్టు కథనాలు వచ్చాయి, కానీ అదే సోమవారం సాయంత్రం ప్రకటించిన అధికారిక ఫలితాల్లో మాత్రం అనసూయ పేరు లేదు. అలా రాత్రికి రాత్రి ఏం జరిగిందబ్బా అంటూ అనసూయ తన అనుమానాన్ని వెల్లిబుచ్చింది. అయితే నిన్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం కూడా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో అనసూయ కూడా అక్కడే ఉంది.

Advertisement

Anasuya Bharadwaj  మీడియాను హెచ్చరించిన అనసూయ

anchor anasuya bharadwaj on politics and maa elections

Advertisement


సమావేశం అనంతరం వెళ్లిపోతూ మీడియాతో అనసూయ ముచ్చటించింది. యూట్యూబ్ చానెళ్లు, న్యూస్ చానెళ్లు అంటూ అనసూయ మండిపడింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరి పర్సనల్ లైఫ్‌ను పర్సనల్ లైఫ్‌లా చూడరంటూ ఫైర్ అయింది. యూట్యూబ్ చానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ మీద అనసూయ ఎక్కువగా హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి అనసూయ చేసిన ఈ రచ్చ మళ్లీనెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి