Home » Entertainment » Anasuya Bharadwaj Showers Love On Disabled Person Dance
Entertainment

Anasuya : అమ్మాయి టాలెంట్‌కి ఫిదా.. అనసూయ పోస్ట్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: March 23, 2021, 4:50 pm
Advertisement

Anasuya Bharadwaj : బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతోన్న అనసూయ ఇప్పుడు చావు కబురు చల్లగా సినిమాతో ట్రెండ్ అవుతోంది. పైన పటారం లోన లొటారం అనే పాటలో అనసూయ వేసిన హాట్ స్టెప్పులు బాగానే క్లిక్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా అనసూయ వేసిన స్టెప్పులు మాత్రం జనాల్లోకి బాగానే వెళ్లాయి. అలా అనసూయ వేసినట్టుగా ఓ దివ్యాంగురాలు అదిరిపోయేలా డ్యాన్స్ వేసింది. దీనిపై అనసూయ స్పందించింది.

Advertisement

అచ్చు తనలాగే డ్యాన్స్ వేయడం, ఆ మూమెంట్స్ సరిగ్గా చేయడంతో అనసూయ ఫిదా అయింది. అయితే ఎవరైనా డ్యాన్స్ వేస్తారు కదా? అని అనుకుంటే పొరబాటే. ఆ అమ్మాయికి చేతుల్లేవ్. అయినా కూడా ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా డ్యాన్స్ చేసింది. అలా ఆ దివ్యాంగురాలు వేసిన స్టెప్పులకు అనసూయ పడిపోయింది. ఆమెను ప్రశంసలతో ముంచెత్తింది. అంతే కాకుండా కార్తికేయ, దర్శకుడు, నిర్మాణ సంస్థలకు కూడా ట్యాగ్ చేసింది.

Anasuya Bharadwaj

Advertisement

Anasuya : అమ్మాయి టాలెంట్‌కి ఫిదా.. అనసూయ

స్వప్నికా అనే దివ్యాంగురాలు చేసిన ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్‌ను చూసి ఆశ్చర్యపోయింది అనసూయ. ఇది నమ్మశక్యంగా లేదు స్వప్పికా.. నీ డ్యాన్స్‌లో ఆ గ్రేస్.. ఆ కాన్ఫిడెన్స్ అదిరిపోయింది అంటూ అనసూయ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు జనాల్లోకి వెళ్లాయి అనే చెప్పేందుకు ఇదొ ఉదాహరణ. అయితే సినిమా డిజాస్టర్ అయినా కూడా అనసూయ వల్ల అంతో ఇంతో జనాల్లోకి వెళ్లినట్టుంది.

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి