Home » Entertainment » Anasuya Dance Video Viral 3
Entertainment

Anasuya : ఏంజిల్ లా మెరిసిపోతున్న అన‌సూయ‌.. డ్యాన్స్ వీడియో వైర‌ల్

Authored By
mallesh
The Telugu News | Updated on: May 22, 2022 8:00 pm
Advertisement

Anasuya : యాంక‌ర్ గా న‌టిగా రాణిస్తున్న అన‌సూయ బ‌ర‌ద్వాజ్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.. హాట్ హాట్ ఫొటో షూట్స్ తో అంద‌రినీ క‌ట్టిప‌డేస్తుంది. ఫ్యామిలీ కి సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంది. అప్పుడ‌ప్పుడు ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెంచుకుంటోంది. న‌డుము ఎద అందాల‌తో నెటిజ‌న్ల‌ను క‌నివిందు చేస్తోంది. సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తూ మెప్పిస్తోంది.

Advertisement

రంగ‌స్థ‌లం సినిమాలో చేసిన రంగ‌మ్మ అత్త పాత్ర మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. అలాగే పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా నెగిటివ్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. అలాగే ర‌వితేజ ఖిలాడీ సినిమాలో గ్లామ‌ర‌స్ పాత్ర‌లో న‌టించి మ‌తిపోగొట్టింది. అలాగే అడవి శేషు క్ష‌ణం మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ గా ఆక‌ట్టుకుంది. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. తాజాగా ద‌ర్జి సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Anasuya dance video viral

Advertisement

అంత‌కు ముందు థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమాలో కీ రోల్ ప్లేచేసింది. అలాగే ప్ర‌స్తుతం పుష్ప 2లో కూడా క‌నిపించ‌నుంది.కాగా ప్ర‌స్తుతం ఇన్ స్టాలో ఓ రీల్ చేసి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కేజీఎఫ్ 2 సినిమాలోని మ‌హ‌బూబా సాంగ్ కి వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఆక‌ట్టుకుంటోంది. బ్రింజ‌ల్ క‌ల‌ర్ డ్రెస్ లో న‌డుము అందాల‌తో సెక్సీ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. రోజురోజుకి మ‌రింత అందంగా అవుతోంద‌ని…కేజీఎఫ్ మూవీలో నిన్ను హీరోయిన్ గా పెట్టాల్సింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి