anasuya fire on netigen
Anasuya: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర యాంకర్‌గా,నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముందు న్యూస్ రీడర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్న అనసూయ ఆ తర్వాత అడవి శేష్ హీరోగా వచ్చిన ‘క్షణం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే హిట్‌తో పాటు మంచి నటి అన్న పేరును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన కెరీర్‌నే మలుపు తిప్పింది. తాజాగా పుష్పలో కూడా లుక్స్ పరంగా డిఫరెంట్‌గా ట్రై చేసింది అనసూయ . దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది.
దర్జా అనే సినిమాలో కూడా అనసూయ నెగెటివ్ పాత్రలో అదరగొట్టనుంది.సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు. కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. అయితే గ్లామర్ విషయంలో ఈ అమ్మడికి అడ్డు అదుపు లేదు. తన అందాలతో నిత్యం నెటిజన్స్ ని మంత్ర ముగ్ధులని చేస్తూనే ఉంటుంది. పొట్టి దుస్తులలో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. కేక పెట్టించే పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలలో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంటుంది.
anasuya fire on netigen
రీసెంట్‌గా అనసూయ పొట్టి దుస్తులు ధరించగా,ఓ నెటిజన్ ఆమె డ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెకే ట్యాగ్ చేశాడు. `అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు` అంటూ కన్నీరు కారుస్తున్న ఎమోజీని పంచుకున్నాడు సదరు నెటిజన్. దీనిపై అనసూయ స్పందించింది. ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. `దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు` అంటూ మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చింది. ఈ దెబ్బకి ఆ నెటిజన్ మరో మాట మాట్లాడలేదు.
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.