Home » Entertainment » Anasuya On Her Husband In Jabardasth Promo
Entertainment

Anasuya : తన భర్త రాముడన్న అనసూయ.. యాంకరమ్మపై నెటిజన్ల సెటైర్లు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 12, 2022, 8:00 pm
Advertisement

Anasuya : అనసూయ భర్త మీద చేసే కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. అనసూయ తన భర్తతో దిగిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. మొన్నటి వెకేషన్‌లో అనసూయ మాల్దీవుల్లో నానా హంగామా చేసింది. తన భర్తతో కలిసి బీచ్‌లో సందడి చేసింది. సముద్ర తీరంలో భర్తతో లిప్ లాక్ చేసి అనసూయ హీటు పెంచేసింది. మొత్తానికి అనసూయ ఏం చేసినా కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. ఇక తాజాగా అనసూయ తన భర్త గురించి కామెంట్ చేయగా.. నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించారు. తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో అనసూయ మీద ఓ స్కిట్ వేశారు.

Advertisement

రైజింగ్ రాజు అనసూయలా కనిపించాడు. దీంతో అనసూయ తలబాదేసుకుంది. తాను అలా ఉన్నానా? అన్నట్టుగా తల కొట్టేసుకుంది. అనసూయ హోం టూర్ అంటూ ఓ స్కిట్ వేశారు. ఇక ఇంట్లో అనసూయ ఎలా ఉంటుందో అని కౌంటర్ వేశారు. ఫేస్ బుక్ లైవ్‌లో అనసూయ నెటిజన్ల మీద ఎలా ఫైర్ అవుతుందో అందరికీ తెలిసిందే. దాన్ని కౌంటర్‌గా వేస్తూ.. ఇది ఫేస్ బుక్ కాదు.. యూట్యూబ్.. అంతలా అరవొద్దన్నట్టుగా కౌంటర్ వేస్తారు. ఇక అనసూయ భర్తగా దొరబాబు ఎంట్రీ ఇస్తాడు. సుశాంక్ భరద్వాజ్ స్థానంలో దొరబాబును పెట్టడంపై అనసూయ తట్టుకోలేకపోయింది.

Anasuya On Her Husband In Jabardasth Promo

Advertisement

మా ఆయన రాముడు.. ఇలాంటి దొరబాబుని పెడతారా? అంటూ అనసూయ ఫైర్ అవుతుంది. అయితే ఈ కామెంట్ మీద నెటిజన్లు అనసూయను ఆడేసుకుంటున్నారు. మీ ఆయన రాముడే కావొచ్చు నువ్ మాత్రం సీతవి కావు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. మొత్తానికి అనసూయ ఏ కామెంట్ చేసినా, ఏం మాట్లాడినా కూడా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వెబ్ సిరీస్‌లోనూ అనసూయ నటిస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే లేడీ ఓరియెంటెడ్ అయిన దర్జా చిత్రంలో అనసూయ నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి