Home » Entertainment » Anasuya Super Answer To The Netigen
Entertainment

Anasuya: రోడ్డుపై నువ్వు మూత్రం పోస్తే ఇంకొక‌డు నీ బెడ్‌పై పోస్తాడు.. అన‌సూయ ఇలా మాట్లాడిందేంటి..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 17, 2022, 9:00 pm
Advertisement

Anasuya : అన‌సూయ ప్ర‌స్తుతం యూత్ క్ర‌ష్‌గా మారింది. ఆమె పేరు చెబితే అభిమానుల‌కి పూన‌కం వ‌స్తుంటుంది. ఒక‌వైపు బుల్లితెర‌పై సంద‌డి చేసే ఈ ముద్దుగుమ్మ వెండితెర‌పై త‌న‌దైన శైలిలో ర‌చ్చ చేస్తుంటుంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ నెటిజ‌న్‌కి స్ట‌న్నింగ్ స‌మాధానం ఇచ్చింది.

Advertisement

ఓ నెటిజన్ ట్రోలింగ్, దాని వల్ల ఫ్యామిలీ బాధపడిన తీరు గురించి అడిగాడు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి అనసూయ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ట్రోలింగ్‌ను పట్టించుకోవద్దనే విషయాన్ని నేర్చుకున్నాను. కెరీర్ ప్రారంభంలో నన్ను, నా ఫ్యామిలీని తెగ ఇబ్బంది పెట్టింది.. ఇప్పుడు అది ప‌ట్టించుకోవ‌డం మానేశాను. కర్మ సిద్దాంతాన్ని నేను నమ్ముతాను. అది కచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుంది.రోడ్డు మీద మనం ఉమ్మేస్తే.. మన మీద ఇంకొకడు ఉమ్మేస్తాడు.. రోడ్డు మీద ఒకడు మూత్రం పోస్తే.. వాడి బెడ్డు మీద ఇంకొకడు మూత్రం పోస్తాడు..

anasuya super answer to the netigen

Advertisement

Anasuya : అన‌సూయకి ఆగ్ర‌హం వ‌చ్చింది…

ఒకరిని నువ్ తిడితే.. ఇంకొకరు నిన్ను తిడతారు.. నువ్ ఒకడిని బాధ పెడితే.. నిన్ను ఒకరు బాధపెడతారు.. అంటూ అనసూయ గీతోప‌దేశం చేసింది. మ‌రో నెటిజ‌న్ మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా లేక అక్క అని పిలవాలా అని అడిగాడు. అతడి ఉద్దేశం అర్థం చేసుకున్న అనసూయ ఘాటుగా బదులిచ్చింది. అసలు ఎలాగూ పిలవద్దు. నువ్వు అలా పిలవడానికి నేనెవరో అంతగా తెలియదు. మన మధ్య చనువు లేదు అని చెప్పింది. పైగా నువ్వు చెప్పింది ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది. మీ పెంపకంపైనే నాకు అనుమానంగా ఉంది అంటూ అనసూయ సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి