Anasuya : చేతగాని వాళ్లు అదుపుతప్పారు.. అనసూయ ఫైర్ వీడియో వైరల్..!!
Anasuya : యాంకర్ అనసూయ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య భారీ ఎత్తున సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలాకాలం సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న అనసూయ విజయ్ దేవరకొండ “ఖుషి” పోస్టర్ లో…”ది” అని ఇంగ్లీష్ అక్షరంపై సెటైర్లు వేయడం జరిగింది. బాబోయ్ పైత్యం ఏం చేస్తాం… అంటకుండా చూసుకుందామని పేర్కొంది. పరోక్షంగా విజయ్ దేవరకొండని కెలికింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేసి… భారీ ఎత్తున ట్రోలింగ్ చేయడం..తో పాటు… రకరకాల కామెంట్స్ తో ఓ రేంజ్ లో విరుచుకుపడటం జరిగింది. ఇక అనసూయ కూడా తగ్గేదేలే మాదిరిగా కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తుంది.
Anchor Anasuya Comments On Vijay Devarakonda Fan
దీంతో సోషల్ మీడియా వార్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ న్యూస్ అయ్యింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ అభిమానులు చేస్తున్న ట్రోలింగ్ పై అనసూయ ఘాటుగా రియాక్ట్ అయింది. నువ్వు నన్ను తిడితే నీ కంపునూరు తప్పు అవుతుంది కానీ నేను ఎలా తప్పు అవుతాను. నా పెంపకం గర్వించదగింది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. బూతులు తిడుతున్న వారిని అసహ్యించుకోండి అంతేగాని బూతులు తిట్టించుకోబడుతున్న వారిని కాదు అని ట్వీట్ చేసింది అనసూయ. అయినా గాని ఇష్యూ పెద్దది రావడంతో పాటు వెబ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉండటంతో లైవ్ లో అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఆ వీడియోలో అనసూయ…”మాలాంటి పబ్లిక్ ఫిగర్స్…
Anchor Anasuya Comments On Vijay Devarakonda Fan
పేరున్న వాళ్లు ప్రముఖ వ్యక్తులపై.. వార్తలు రాస్తూ పొట్ట నింపుకునే వారికోసం… చెప్పేదేమిటంటే అభిమానులు ఏడిపించారు అనసూయని.. వెంట పడ్డారు… ట్రోల్ చేశారు. ఇది కాదు.. మీకు ఇంకా దునియా దారి తెలియదు. మళ్లీ చెబుతున్నా మీకు.. చెబుతున్న క్లారిటీ ఇస్తున్న. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. అన్నవాడు నోరే కంపు. సో మీకు ధైర్యం ఉంటే.. ఉప్పుకారాలు తిను ఉంటే.. నిజం రాయండి. నేను నిజం మాట్లాడా… నా అభిప్రాయం తెలియజేశా..చేతగాని వాళ్లు అదుపుతప్పారు ఇది మీరు రాయాల్సిన తంబనైల్ అంటూ… అనసూయ వీడియోలో తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఒక విధంగా ఈ వీడియోలో మీడియా వర్గాల తో పాటు విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా.. పరోక్ష కౌంటర్ ఇవ్వడం జరిగింది.
