Home » Entertainment » Anchor Lasya Comments On That Person
Entertainment

Anchor Lasya : ఓ ఉన్నత స్థాయి వ్యక్తి డైరెక్ట్‌గా నన్ను పక్కలోకి రమ్మన్నాడు.. యాంకర్ లాస్య సంచలన కామెంట్స్..

Authored By
mallesh
The Telugu News | Published on: December 30, 2021, 3:40 pm
Advertisement

Anchor Lasya : యాంకర్ లాస్య మంజునాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై బ్యూటిఫుల్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఈమె.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని తన కాళ్ల మీద నిలబడి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్త మంజునాథ్, బాబుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న లాస్య.. ఓన్ యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసింది. అందులో పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది.‘సంథింగ్ స్పెషల్’ షో తో యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది లాస్య.

Advertisement

ఇక అక్కడి నుంచి పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది లాస్య. సంప్రదాయినికి ప్రతీక అయిన చీర కట్టులో కనిపిస్తూ లాస్య ప్రేక్షకులను తన మాటలతో కట్టిపడేస్తుంటుంది. మంజునాథ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న లాస్య..తర్వాత ఇరు ఫ్యామిలీస్‌ను ఒప్పించింది. ఇకపోతే ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్‌లో పడిన ఇబ్బందులు చెప్పింది. తనకు ఇప్పుడు వచ్చిన స్టార్ స్టేటస్ ఒక్క నైట్‌లో వచ్చింది కాదని, చాలా కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చినట్లు లాస్య తెలిపింది.తాను యాంకర్‌గా చేస్తున్న టైంలో అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఈవెంట్‌కు వెళ్లినపుడు తనకు చేదు అనుభవం ఎదురైందని తెలిపింది.

Anchor Lasya comments on that person

Advertisement

Anchor Lasya : ఎంతో మంది స్టార్ యాంకర్స్ అలా చేశారు…!

ఓ ఉన్నత స్థాయి వ్యక్తి తనకు కాల్ చేసి డైరెక్ట్‌గానే తనను పక్కలో పడుకుంటావా అని అడిగేశాడని, అందుకు నేను నో చెప్పానని తెలిపింది లాస్య. సదరు ఉన్నత స్థాయి వ్యక్తి తన చెప్పిన మాటలు విని కోప్పడ్డాడని, తనతో స్టార్ యాంకర్స్ పడుకున్నారని, నువ్వెంత అని తనను దూషించాడని చెప్పింది లాస్య. లాస్య కామెంట్స్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ వ్యభిచార కూపంలో ఇరుక్కున్నారని లాస్య సంచలన ఆరోపణలు చేసింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి