Home » Entertainment » Anchor Pradeep In Super Queen Sankranthi Special Episode
Entertainment

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ పెళ్లిని ఇలా కూడా వాడుకుంటున్నారా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 13, 2022, 11:35 am
Advertisement

Anchor Pradeep : ప్రదీప్ పెళ్లి అనేది బుల్లితెరపై ఎప్పుడూ ఓ హాట్ టాపిక్కే. ఏకంగా ప్రదీప్ పెళ్లి కోసమే ఓ షోను పెట్టారు. దానికి సుమను హోస్ట్‌గా తీసుకొచ్చారు. స్వయంవరం లాంటి కాన్సెప్ట్‌లతో కొంత మంది అమ్మాయిలతో షోను నడిపించారు. అలా ప్రదీప్ పెళ్లి ఎప్పుడూ ముగిసిపోని అధ్యాయంగా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ప్రదీప్ పెళ్లి చర్చకు రాకుండా ఈవెంట్ ముందుకు సాగదు.

Advertisement

అది ఏ పండుగ ఈవెంట్ అయినా సరే అక్కడ ప్రదీప్ ఉంటే.. కచ్చితంగా అతని పెళ్లి టాపిక్ రావాల్సిందే. ప్రతీ ఒక్కరూ పంచ్‌లు వేయాల్సిందే. అలా ప్రదీప్ పెళ్లి మీదున్న డిమాండ్‌ను అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తానికి మరోసారి ఈ పెళ్లి తంతుని వాడేశారు. జీ తెలుగులో సూపర్ క్వీన్ అనే షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రదీప్ వారితో చేసే చిలిపి చేష్టలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Anchor Pradeep In Super Queen Sankranthi Special Episode

Advertisement

Anchor Pradeep : ప్రదీప్ పెళ్లిపై లాస్య కొడుకు..

ఇక ఈ సంక్రాంతి స్పెషల్‌గా రాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో ఏకంగా మంగళ స్నానాలాంటివి చేయించారు. లాస్య కొడుకు జున్నుగాడిని ముందు పెట్టి.. ప్రదీప్ మామ అని పిలుపించి బాగానే అరేంజ్ చేశారు. మొత్తానికి ప్రదీప్ పెళ్లిని మాత్రం ఇలా బుల్లితెరపై కంటిన్యూ చేస్తూనే ఉండేట్టు కనిపిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్‌లో రాజశేఖర్, జీవిత కూడా ఎంట్రీ ఇచ్చారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి