Home » Entertainment » Anchor Pradeep Marriage Fixed
Entertainment

Anchor Pradeep : ఓ ఇంటి వాడు కాబోతున్న యాంకర్ ప్రదీప్ .. అమ్మాయి ఎవరంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: February 2, 2022, 11:00 am
Advertisement

anchor pradeep : బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరు, గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ వంటి ప్రోగ్రామ్స్ తో ప్రదీప్ ..తనకంటూ ప్రత్యేకమైన రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. కాగా, ప్రదీప్ మాచిరాజు త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అమ్మాయి ఎవరంటే..కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హీరోస్ అందరూ దాదాపుగా మ్యారేజ్ చేసుకున్నారు. ప్రభాస్ మినహా మిగతా హీరోలందరూ పెళ్లి చేసుకున్నారు. నితిన్, రానా దగ్గుబాటి, నిఖిల్ సిద్ధార్థ పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఇప్పడిక ప్రదీప్ మాచిరాజు వంతు వచ్చేసిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ప్రదీ ప్ మాచిరాజు రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కూతురును పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ప్రదీప్ తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను అఫీషియల్ గా తానే ప్రకటిస్తారట. అయితే, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ప్రదీప్ స్పందించలేదు. ఇకపోతే ప్రదీప్.. రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్ గా, యాక్టర్ గా ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ఉన్నాడు. హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాను కూడా చేసిన ప్రదీప్ మాచిరాజు

Anchor Pradeep marriage fixed

Advertisement

Anchor Pradeep : త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్..!

.. పలు చిత్రాల్లో నటించాడు. ‘100% లవ్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’, ‘జులాయి’, ‘వరుడు’, ‘రామయ్య వస్తావయ్యా’,‘భామ్ బోలేనాథ్’ చిత్రాల్లో నటించాడు. ఢీ షోలో జడ్జిలతో పాటు కంటెస్టెంట్స్ పైన తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించేందుకుగాను తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రదీప్ మాచిరాజు. సుడిగాలి సుధీర్, ప్రదీప్ మాచిరాజు మధ్య ‘ఢీ’షో తో పాటు ఇతర కార్యక్రమాల్లో పంచులు బాగా పేలుతుంటాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి