Rashmi Gautam : ఆరోగ్యం గురించి చింతించకండి.. వ్యాధి విషయం చెప్పిన యాంకర్ రష్మీ
Rashmi Gautam : యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. యాంకర్ రష్మీ ఓ పెట్ లవర్. ఈ సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. పెట్స్ కోసం రష్మీ ఎంతో పాటు పడుతుంటుంది. మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతుంటుంది. రష్మీ చేసే సేవా కార్యక్రమాల పట్ల కొందరు ఆకర్షితులవుతారు. ఇంకొందరు ఆమె మీద నెగటివ్ కామెంట్లు చేస్తుంటారు. అయితే రష్మీ మాత్రం జంతువుల పట్ల ఎప్పుడూ ప్రేమను కనబరుస్తూనే ఉంటుంది. రష్మీ వద్ద ప్రస్తుతం ఓ పెట్ ఉందన్న సంగతి తెలిసిందే.
రష్మీకి వీధిలో గాయపడి ఉన్న ఓ కుక్క కనిపించింది. దాన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేసింది. ఆ తరువాత తన ఇంటికి తీసుకెళ్లింది. అదే ఇప్పుడు చుట్కీగా మారిన సంగతి తెలిసిందే. అయితే చుట్కీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రష్మీ తన పెట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. తనకున్న సమస్యల గురించి చెబుతుంటుంది. అయితే ఇప్పుడు చుట్కీ హెల్త్ అప్డేట్‌పై ఆమె అభిమానులు ఆందోళన చెందుతూ వచ్చారు. వారందరి కోసం రష్మీ అసలు విషయం చెప్పింది.
Anchor Rashmi Gautam About Her Pet Chutki Disease
చుట్కీ కోసం ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు.. దానికి బోన్ డీజనరేటివ్ డిస్ ఆర్డర్ ఉంది.. దాన్ని మనం క్యూర్ చేయలేం.. పెయిన్ కిల్లర్స్ ఇస్తూ దాని బాధను తాత్కాలికంగా పోగొట్టగలమంతే..బోన్ సప్లిమెంట్స్ ఇవ్వగలమంతే.. రెగ్యులర్‌గా ఎక్స్ రేలు, స్కానింగ్‌లు తీస్తూ ఎప్పటికప్పుడు దాని స్టేటస్‌ను చూస్తుండాలి అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రష్మీ మాత్రం తన పెట్ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక రష్మీ ఇప్పుడు బుల్లితెరపై మంచి ఫాంలో ఉంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ తన మార్క్ చూపిస్తోంది.
Anchor Rashmi Gautam About Her Pet Chutki Disease
సిల్వర్ స్క్రీన్ మీద రష్మీ కనిపించక చాలా రోజులే అయింది. ఇక గీతా మాధురి భర్త నందుతో చేసిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో రష్మీ నటించింది. కానీ ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. కరోనా వల్ల ఆలస్యమవుతూ వస్తోన్నట్టు కనిపిస్తోంది.
