Home » Entertainment » Anchor Rashmi Gautam Reallife Story In Sridevi Drama Compnay Skit
Entertainment

Rashmi Gautam : అర్దరాత్రి ఒంటరిగా యాంకర్ రష్మీ.. గతాన్ని తలుచుకుని కంటతడి పెట్టేసిందిగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 21, 2022 9:33 pm
Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మీ తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటోంది. అయితే సినిమాల్లో నటించినా కూడా రాని క్రేజ్.. బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా వచ్చింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరికీ కూడా రష్మీ అంటే ఓ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు రష్మీ శ్రీదేవీ డ్రామా కంపెనీలో సందడి చేస్తోంది. సుధీర్ వెళ్లిపోయినప్పటి నుంచి రష్మీ ఆ స్థానంలోకి వచ్చింది. సుధీర్ స్థాయిలో కాకపోయినా కూడా రష్మీ తన స్టైల్లో మెప్పిస్తోంది.

Advertisement

అయితే వచ్చే ఆదివారం నాడు ఓ స్పెషల్ ఈవెంట్ చేయబోతోన్నారు. అందులో రష్మీ చుట్టే ఈ ఎపిసోడ్ ఉండబోతోంది. అక్కా బావెక్కడ అంటూ సాగే ఈ ఎపిసోడ్‌లో రష్మీ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పబోతోన్నట్టుగా ప్రోమోలో చూపించారు. కానీ తీరా ఎపిసోడ్ చూస్తే వ్యవహారం వేరే ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ ఎమోషనల్ ఘట్టం ఉంది. రష్మీ బయోగ్రఫీని ఒకే ఒక్క స్కిట్‌లో వేసి చూపించారు. ఇక అది చూసి రష్మీ సైతం కంటతడిపెట్టేసుకుంది.

Anchor Rashmi Gautam RealLife Story In Sridevi Drama Compnay SKit

Advertisement

రష్మీ తల్లిదండ్రులు ఎలా విడిపోయారు.. తన తల్లి ఒంటరిగా తనను ఎలా పోషించిందో చూపించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రష్మీకి ఎదురైన అనుభవాలు, గడ్డు పరిస్థితుల గురించి వివరించారు. ఇండస్ట్రీలోకి వెళ్తాను అని తన తల్లితో రష్మీ చెప్పిన సంగతి, నాడు జరిగిన సంభాషణను చూపించారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది నీకు తెలుసు.. నీకు నచ్చింది చేయమ్మ అని రష్మీకి తన తల్లి ఇచ్చిన సపోర్ట్ గురించి చూపించారు. అయితే ఓ సారి షూటింగ్ లేట్ అవ్వడంతో అర్దరాత్రి రష్మీ పడిన బాధల గురించి చెప్పారు.

ఓ సారి అర్దరాత్రి అవ్వడం, గేట్ కూడా ఎవ్వరూ ఓపెన్ చేయకపోవడంతో.. భయంతో అక్కడే ఉండిపోయిన ఘటనను చూపించారు. అది చూసి రష్మీ మరోసారి కంటతడి పెట్టేసింది. మొత్తానికి రష్మీ తాను పడిన బాధలను మరోసారి ఇలా గుర్తుకుతెచ్చుకున్నట్టు అయింది.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి