Anchor Rashmi Mehabooba Song Reel Video
Anchor Rashmi : బుల్లితెరపై యాంకర్ రష్మి క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ జోడిగా ఎంత అలరించిందో.. ఒంటరిగా సుధీర్, రష్మీలు కూడా అంతే అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి ఈ జోడి వేరు అయింది. సుధీర్ స్టార్ మాకు వెళ్లిపోయాడు. రష్మీ ఈటీవీలోనే ఉండిపోయింది. అయితే రష్మీ అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్ల కోసం స్టార్ మాలోకి వెళ్తుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం రష్మీ ఈటీవీకే పరిమితమైంది.ఎక్స్ ట్రా జబర్దస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవీ డ్రామా కంపెనీని కూడా నడిపిస్తోంది రష్మీ. గత వారం నుంచే రష్మీ శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి వచ్చింది.
యాంకర్‌గా ఆ షోను నడిపించేందుకు ముందుకు వచ్చింది. మొత్తానికి రష్మీ మాత్రం సుధీర్ లేని లోటును తీర్చాలని చూస్తోంది. కానీ జనాలు మాత్రం సుధీర్‌నే కోరుకుంటున్నారు. అయినా కూడా సుధీర్ వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక రష్మీ మాత్రం కంటిన్యూ అయ్యేట్టుంది. తాజాగా రష్మీ ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. అది కూడా నడి రోడ్డు మీద చేసేసింది. అసలే రష్మీ డ్యాన్సులు ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. స్టేజ్ మీద రష్మీ స్టెప్పులు వేస్తే అవి ట్రెండింగ్‌గా మారుతున్నాయి.ఓ సారి ఇలానే రష్మీ తన నడుము ఊపుతూ వేసిన స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ పరివార్ అంటూ జరగబోతోన్న ఈవెంట్‌లోనూ రష్మీ ఓ రేంజ్‌లో స్టెప్పులు వేసినట్టుంది.
Anchor Rashmi Mehabooba Song Reel Video
ఇక ఇప్పుడు ఈ రీల్ వీడియోలో అయితే రష్మీ సింపుల్‌గా తన కళ్లతోనే మాయ చేసేస్తోంది. చీరకట్టుతో అందరినీ కట్టిపడేస్తోంది. అసలే తనకు ఎంతో ఇష్టమైన పాట అని, ఈ మధ్య అదే మైండ్‌లో తిరుగుతోందని కూడా రష్మీ చెప్పుకొచ్చింది. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలోని మెహబూబ అనే పాట ఈ మధ్య ఎక్కువగా తిరుగుతోందని, అందుకే ఈ రీల్ వీడియో చేశాను అని రష్మీ తెలిపింది. ఇక రష్మీ సోయగాలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. రష్మీ అందాలను నెటిజన్లు పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.