anchor ravi comments on shanmukh
Shanmukh : ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ రన్నరప్ గా నిలిచిన యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ గురించి సోషల్ మీడియాలో జరిగిన డిస్కషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బిగ్ బాస్’ హౌజ్ లో కంటెస్టెంట్ గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇకపోతే ఆయన హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు దీప్తి సునయన బ్రేకప్ చేప్పేసింది. ఈ సంగతి అలా ఉంచితే.. షణ్ముక్ జస్వంత్ మళ్లీ బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైపోయాడు. ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ‘బీబీ జోడీ ఈవెంట్’ ప్రోమో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది. ఈ నెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ షో ప్లాన్ చేశారు. అందులో భాగంగా షణ్ముక్ జస్వంత్ పర్ఫార్మ్ చేశారు. ‘ఆర్య 2’ చిత్రంలోని ‘పోయే పోయే లవ్ పోతే పోయే’ సాంగ్ కు గాను షణ్ముక్ ఎక్సలెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో పర్ఫార్మ్ చేశాడు. ఈ క్రమంలోనే యాంకర్ రవి షణ్ముక్ కు ఆసక్తి కర ప్రశ్నలు వేశాడు.‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నంబా, ఆల్వేస్ బీ హ్యాపీ’ అనే సాంగ్ కు కూడా షణ్ముక్ పర్ఫార్మ్ చేశాడు.
anchor ravi comments on shanmukh
ఇకపోతే ప్రేమ మీద నమ్మకం ఉందా? నీకు అని రవి షణ్ముక్ ను ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా ప్రేమ మీద నమ్మకం ఉంటే ఓ ‘సారీ, థాంక్స్, బై’ ఎవరికి చెప్తావని అడిగాడు. షణ్ముక్ ఏం చెప్పాడు అనేది తెలియాలంలే షో టెలికాస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే, ఈ ప్రోమో చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. షణ్ణు కళ్లలో బాధ కనబడుతున్నదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.