Anchor Ravi : యాంకర్ రవి బిగ్ బాస్ షోతో తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. యాంకర్ రవి అంటే అందరికీ తెలుసు కానీ రవి కిరణ్ అంటే ఏంటో చూపిస్తాను.. తన ఒరిజినాలిటీ ఏంటో అందరికీ చూపిస్తాను.. తన మీద మరకలను తొలిగించుకుంటాను.. అందుకే బిగ్ బాస్ షోలోకి వస్తున్నాను అంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ షోలొ రవి ఆడిన ఆటలు, వేసిన వేషాలు, అబద్దాలు అన్నీ కలిసి రవిని విలన్ చేసేశాయి. అయితే చివరకు వియా రాకతో రవి హీరో అయ్యాడు. కానీ ఆ వెంటనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అలా బిగ్ బాస్ జర్నీ అనేది రవికి జీవితంలో స్పెషల్ అయింది. తన పాప వియా, భార్య నిత్యా ఇద్దరూ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు.
ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేశారు. అలా చివరకు బిగ్ బాస్ షోద్వారా రవికి చేదు అనుభవాలే ఏర్పడ్డాయి. నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. మొత్తానికి రవి ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. మొన్నటి వరకు బిగ్ బాస్ ఓటీటీ బజ్ ద్వారా అందరినీ దగ్గరయ్యాడు. బజ్ ఇంటర్వ్యూలు బాగానే ఫేమస్ అయ్యాయి. అయితే వాటిలో కొంత మంది కంటెస్టెంట్లకు రవి పక్షపాత వ్యవహరించాడట. ఇదే విషయాన్ని తాజాగా రవిని ఓ నెటిజన్ అడిగాడు. తాజాగా రవి తన అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అందులో భాగంగా ఓ నెటిజన్ అలా అడిగాడు.
నువ్ యాంకర్‌గా బిగ్ బాస్ ఓటీటీ బజ్‌లో పక్షపాతంగా వ్యవహరించావని నేను అంటాను.. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ నెటిజన్ అడిగేస్తాడు. దానికి రవి ఎంతో కూల్‌గా సమాధానం ఇచ్చాడు. అందులో తన మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించాయి. ఎంతో కూల్‌గానే సమాధానం ఇస్తూ తన చేతుల్లో ఏమీ ఉండదని చెప్పకనే చెప్పేశాడు. అందరినీ అన్ని విధాలుగా మనం శాటిస్‌ఫై చేయలేం.. నాకు వర్క్ మీకు అలా అనిపించి ఉంటే నేనేం చేయలేను.. అయినా మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను.. కానీ నేను చేసిన పని పట్ల మా టీం, చానెల్, బిగ్ బాస్ టీం అంతా కూడా సంతృప్తికరంగానే ఉంది. నాకు అది చాలు అని అనేశాడు.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.