Home » Entertainment » Anchor Ravi Satires On Ashu Reddy
Entertainment

Ashu Reddy : నీకు అది కూడా వస్తుందా?.. అషూ రెడ్డి పరువుతీసిన యాంకర్ రవి

Authored By
Sam C
The Telugu News | Published on: February 23, 2022, 8:00 pm
Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ షోతో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న అషూ రెడ్డి సోష‌ల్ మీడియాలో తెగ యక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా త‌న గ్లామ‌ర్ తో కుర్ర‌కారుకి కంటిపై నిద్ర‌లేకుండా చేస్తుంది. ఈ భామ చేసే ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే అమ్మడి డ్రెస్సుల విషయంలో ట్రోల్స్ ఎదుర్కుంటూ ఉండే అషూ అప్పుడ‌ప్పుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంటుంది. ముఖ్యంగా యాంక‌ర్ ర‌వితో ఇటీవ‌ల తెగ ర‌చ్చ చేస్తుంది. రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేస్తూ.. వ‌రుడు కావ‌లెను, సిగ్గొస్తుంది ఎందుకో అని కామెంట్ అని పెట్టింది. దీనికి స్పందించిన యాంక‌ర్ ర‌వి.. నీకు అది కూడా వ‌స్తుందా అంటూ కామెంట్ పెట్టాడు.దీంతో అషూ ప‌రువు పోయినంత ప‌ని అయింది.

Advertisement

ఇక రీసెంట్‌గా ఈ అమ్మ‌డు అల్ట్రా మోడ్రన్ స్టైల్‌లో టార్న్‌ డెనిమ్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన అషూ.. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని ఒక పెద్దాయన చెప్పాడంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసి నెటిజన్లు ఆమెపై అటాక్ చేస్తున్నారు.పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే ‘చిరిగిన చొక్కా వేసుకున్నావ్‌ సరే.. మరి పుస్తకం కొన్నావా?’, ‘కొటేషన్ బాగుంది కానీ మరి మంచి పుస్తకం కొనుకున్నవా లేదా’ అని ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Anchor Ravi satires on ashu Reddy

Advertisement

Ashu Reddy : అషూని అలా బుక్ చేశాడేంటి…!

ప్ర‌స్తుతం అషూ రెడ్డి.. విజయ్​ శంకర్​ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’​. ఇందులో సుహాసినీ మణిరత్నం కీలకపాత్రలో నటించనున్నారు. జి. సూర్యతేజ దర్శకత్వంలో స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ‘మర్డర్‌ మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. విజయ్‌ శంకర్‌ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో సుహాసినీ జడ్జ్‌ పాత్రలో అలరించనున్నారు. త్వరలోనే మా సినిమా టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి