
Anchor Ravi VJ sunny Fight Each Other in Bigg Boss Kings Vs Queen Event
Anchor Ravi : బిగ్ బాస్ ఇంట్లో వీజే సన్నీ, యాంకర్ రవిలు ఎలా గొడవపడుతుండే వారో అందరికీ తెలిసిందే. ప్రతీ విషయంలో ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక చర్చ రావడం, అది కాస్త తీవ్రస్థాయిలో మారిపోవడం జరుగుతుంటుంది. అలా యాంకర్ రవి, సన్నీల మధ్య స్నేహం ఉన్నా కూడా అది ఎప్పుడూ గొడవలకు దారి తీస్తూనే ఉంటుంది. బయటకు వచ్చాక కూడా అలాంటి ధోరణినే ఉందని తాజాగా బయటకు వచ్చింది. సన్నీ, రవిలు బాగానే కలిసి ఉన్నారు. రవి ఇంటికి సన్నీ వెళ్లాడు. ఈ ఇద్దరూ కలిసి బాగానే ఉన్నట్టు కనిపించింది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో కలిసి స్టార్ మా ఈవెంట్లు చేస్తుంటుంది. అలా తాజాగా ఓ ఈవెంట్ చేసినట్టు కనిపిస్తోంది.
ఇందులో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని పెట్టారు. బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొన్న అమ్మాయిలను క్వీన్స్‌గా, అబ్బాయిలను కింగ్స్‌గా డివైడ్ చేశారు. ఈషోను యాంకర్ రవి హోస్ట్‌గా ముందుకు నడిపించాడు. ఇందులో ఎక్కువగా బిగ్ బాస్ నాలుగు, ఐదు సీజన్ల కంటెస్టెంట్లే కనిపిస్తున్నారు. అయితే చివర్లో హమీద ఇచ్చిన ట్విస్ట్‌తో గొడవ మొదలైంది. ఏదో పనిష్మెంట్ ఇవ్వడంతో చేయను అని చెప్పింది హమీద.ఏదో జంతువులా అరవాలంటూ హమీదను కింగ్స్ టీం ఆర్డర్ వేసింది. నేను చేయను అని హమీద అనడంతో సన్నీకి బీపీ పెరిగింది. ప్రతీసారి అలా అంటే ఎలా అని రెచ్చిపోయాడు.
Anchor Ravi VJ sunny Fight Each Other in Bigg Boss Kings Vs Queen Event
మధ్యలోకి యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. కూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ రవి మాటలకు సన్నీ ఏ మాత్రం తగ్గలేదు. సన్నీ చేష్టలు కూడా హద్దులు దాటాయి. రవిని తోసేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎందుకు తోశావ్ అని రవి అడిగితే.. అది తోసేయడమా? అంటూ నాలుగైదు సార్లు తోసేశాడు సన్నీ. దీంతో గొడవ మరింత పెద్దదైంది. అందరూ వచ్చి వారిద్దరి ఆపాలని ప్రయత్నించినా కుదర్లేదు. ఒక వైపే పక్షపాతం చూపిస్తున్నాడంటూ రవి మీద సన్నీ ఆరోపణలు చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావ్ అంటూ పరువుతీశాడు.అక్కడిది ఇక్కడిది కాదు.. ఇక్కడ మాట్లాడంటూ రవి వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం వైరల్ అయింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.