Home » Entertainment » Anchor Suma And Bhanu Satires On Paradesi In Suma Cash Show
Entertainment

Anchor Suma : పరదేశీ పరువుపాయే.. యాంకర్ సుమ ఇలా, టిక్ టాక్ భాను అలా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 31, 2022 7:43 pm
Advertisement

Anchor Suma : జబర్దస్త్ కమెడియన్ అంటూ అందరికీ ఓ మోస్తరు గుర్తింపు ఉంటుంది. ఇక పరదేశీ, దొరబాబులకు అయితే ఇంకాస్త ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఆ ఇద్దరూ వైజాగ్ వ్యభిచార గృహంలో పట్టుబడటం అందరికీ తెలిసిందే. ఈ వైజాగ్ ఘటనతో ఈ ఇద్దరి జీవితం మారిపోయింది. అయితే ఈ ఇద్దరినీ హైపర్ ఆది ఎలాగోలా బయటకు తీసుకొచ్చాడు. మళ్లీ తన టీంలోనే పెట్టేసుకున్నాడు. తన టీంలో పెట్టుకున్న క్షణం నుంచి చేసిన ప్రతీ స్కిట్‌లో వైజాగ్ ఘటన మీద, పరదేశీ దొరబాబుల మీద కౌంటర్లు వేస్తూనే వస్తున్నాడు. ఇక ప్రతీ షోలో ఈ ఇద్దరి మీద అవే కౌంటర్లు కనిపిస్తుంటాయి. ఇక తాజాగా సుమ తన క్యాష్ షోలకి పరదేశీని తీసుకొచ్చింది. పరదేశీకి జోడిగా టిక్ టాక్ భాను వచ్చింది.

Advertisement

ఈమెను లండన్ భాను అని కూడా అంటుంటారు. మధ్యలో లండన్ వెళ్లి వచ్చిందట. అందుకే ఆమెను లండన్ భాను అంటూ అందరూ సెటైర్లు వేస్తుంటారు. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అవ్వడంతో.. బుల్లితెరపై చాన్స్ వచ్చింది. కమెడియన్ అని కూడా ఈమెను అనలేం. కేవలం డ్యాన్సులు మాత్రమే చేస్తుంటుంది. ఇక తాజాగా పరదేశీతో కలిసి క్యాష్ షోకి వచ్చింది. మీ ఇద్దరూ జోడీనా? అని సుమ ఎంట్రీలోనే అడుగుతుంది. చీచీ కాదు అన్నట్టుగా భాను అనేస్తూ పరదేశీ పరువుతీస్తుంది. అంతలా చీచీ కాదు అని అందంటే.. బయట ఎవరో ఉన్నారేమో అని సుమ అంటుంది. ఇక పరదేశీని పలుచోట్లు సుమ ఆడుకుంటుంది.

Anchor Suma And Bhanu Satires on Paradesi in Suma cash Show

Advertisement

నిజాలు చెబుతున్నారా? లేదా? అనే ఓ రౌండ్ పెట్టింది సుమ. ఇందులో భాగంగా పరదేశీ భానులను తీసుకొచ్చింది. భాను ఏదో ప్రశ్నకు సమాధానం చెప్పింది. మిషన్ అరిచింది. దీంతో పరదేశీ కౌంటర్ వేశాడు. ఏదైనా రొమాంటిక్‌గా అరవొచ్చు కదా? అని అంటాడు. నీ గురించి అంతా తెలిసినట్టుంది.. సీసీ కెమెరా పుటేజ్ దొరికినట్టుంది అని పరదేశీ పరువుతీస్తుంది సుమ. నాటి వైజాగ్ ఘటన మీద ఎలాగోలా కచ్చితంగా పంచ్‌లు పడుతూనే వస్తున్నాయి. చివరకు సుమ ఇలా సీసీటీవీ పుటేజ్ అని అనడంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి