Home » Entertainment » Anchor Suma Fans Want A Talk Show From Her
Entertainment

Anchor Suma : యాంకర్ సుమ నుండి దాన్ని కోరుకుంటున్న బుల్లితెర అభిమానులు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 20, 2022 1:19 pm
Advertisement

Anchor Suma : బుల్లి తెరపై యాంకర్ గా దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న యాంకర్ సుమ ఎన్నో గేమ్ షో లతో బుల్లి తెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరూ హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ ని సుమ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర వహిస్తారు. సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది అంటే ఆ షో కానీ కార్యక్రమం కానీ సూపర్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న క్యాష్ కార్యక్రమం ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె నుండి అంతా కూడా ఒక టాక్ షో ని ఆశిస్తున్నారు.

Advertisement

సుమ గతంలో ఎంతో మంది స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇంటర్వ్యూలు కాకుండా ఒక టాక్‌ షో చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా టాక్‌ షో ముగిసిన విషయం తెలిసిందే. చివరి ఎపిసోడ్ లో ఆలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా సుమ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే సుమ నుండి టాక్ షో కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆలీతో సరదాగా కి బదులుగా సుమ తో సరదాగా అనే టాక్‌ షో వస్తే బాగుంటుందని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. సుమ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

Anchor Suma fans want a talk show from her

Advertisement

అయినా కూడా ఆమెను టాక్‌ షో చేసేందుకు తీసుకొస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీలో కాకుండా మరేదైనా షోలో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇతర కార్యక్రమాలకు సుమ ఎలాగూ యాంకర్ గా వ్యవహరిస్తుంది. అదే సమయంలో ఒక టాక్ షో కి యాంకర్ కి వ్యవహరిస్తే ఆమె స్థాయి మరింతగా పెరుగుతుందని అభిమానులతో పాటు బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సుమ అభిప్రాయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి