Home » Entertainment » Anchor Suma Fun With Dance Masters In Cash
Entertainment

Anchor Suma : సుమకు ఘోర అవమానం!.. షోలో ఒక్కసారిగా అలా జరగడంతో షాక్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 12, 2021, 4:00 pm
Advertisement

Anchor Suma యాంకర్ సుమ Anchor Suma  బుల్లితెరపై చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ షోల్లో సుమ చేసే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. తన షోలకు ఏ వయసు వారు వచ్చినా సరే అదే స్టైల్లో సుమ ఆడుకుంటుంది. సీనియర్లు జూనియర్లు చిన్నా పెద్దా అనే తేడా ఏమీ ఉండదు. అక్కడ సుమ ఉందంటే చాలు. పంచుల వర్షం కురవాల్సిందే. ప్రాసల దాడి జరగాల్సిందే. నవ్వుల మోత మోగాల్సిందే.అలా తాజాగా సుమ అందరినీ దడదడలాడించింది.

Advertisement

Anchor Suma Fun With Dance Masters In Cash

క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోలో డ్యాన్స్ మాస్టర్లు వచ్చారు. శివ శంకర్, అమ్మ రాజ శేఖర్, తరుణ్ మాస్టర్, పాపీ మాస్టర్ ఇలా అందరూ వచ్చి సందడి చేశారు. ఇక ఇందులో సీనియర్‌లు అయిన తరుణ్ మాస్టర్, శివ శంకర్ మాస్టర్‌ను అందరూ ఆడుకున్నారు. ఇక సుమ అయితే వారి వయసు, ఫిట్ నెస్ మీద కౌంటర్లు వేశారు. కిందకు వంగి చేత్తో వారి వారి కాలి బొటన వేలును పట్టుకోవాలని చెప్పింది.

Advertisement

 

Anchor Suma Fun With Dance Masters In Cash

Advertisement

సుమకు ఘోర అవమానం!.. షోలో ఒక్కసారిగా అలా జరగడంతో షాక్ Anchor Suma

అయితే అది శివ శంకర్, తరుణ్ మాస్టర్ల వల్ల కాదని అమ్మ రాజశేఖర్ కౌంటర్ వేశాడు. తరుణ్ మాస్టర్ ట్రై చేశాడు కానీ కుదర్లేదు. ఇక చివరకు అందరూ కలిసి సుమనే టార్గెట్ చేశారు. ఇక సుమ కూడా ప్రయత్నం చేసింది. కిందకు వంగి తన కాలి బొటన వేలును పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ అంతలోపే కిందకు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. వినాయక చవితి అని పిలిచి నన్ను ఇలా చేస్తారా? అంటూ సుమ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Anchor Suma Fun With Dance Masters In Cash

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి