Home » Entertainment » Anchor Suma New Show In Etv Getting Trolls
Entertainment

Anchor Suma : సూపర్‌ హిట్‌ క్యాష్ ఆపేసి ఈ పిచ్చి షో ఏంటి సుమ గారు…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 5, 2023, 10:20 am
Advertisement

Anchor Suma : ఈటీవీలో సుమ యాంకర్‌ గా వచ్చిన స్టార్‌ మహిళ మరియు క్యాష్ షో లు వరల్డ్ రికార్డులను సృష్టించాయి అనడంలో సందేహం లేదు. ఎన్నో ఏళ్ల పాటు కొనసాగి ఒక చరిత్ర అన్నట్లుగా సాగిన ఈ రెండు షో లు అద్భుతమైన వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి. ఈటీవీ ఈ స్తాయిలో నిలవడానికి కారణం సుమ కార్యక్రమాలు కూడా ఒక కారణం అంటూ విశ్లేషకులు అంటూ ఉంటారు. అంతటి గొప్ప చరిత్ర ఉన్న కార్యక్రమాలు కనిపించకుండా పోయాయి. ఇటీవలే ఈ రెండు షో లను కూడా ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. స్టార్‌ మహిళ ముగిసి చాలా కాలం అయ్యింది…

Advertisement

క్యాష్ షో ఈ వారం నుండి రావడం లేదు. క్యాష్ షో ప్రసారం అయ్య శనివారం రాత్రి ఆ సమయంకు ఏ కార్యక్రమం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ టైమ్‌ స్లాట్ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమే రాబోతున్నట్లుగా ప్రోమో వచ్చింది. సుమ అడ్డ అంటూ ఒక గేమ్‌ షో కమ్‌ టాక్ షో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. క్యాష్ షో స్థాయిలో ఆ కార్యక్రమం ఉంటుందా అనేది చూడాలి. ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ తో వచ్చిన క్యాష్ షో ను సుమ అడ్డ మరిపిస్తుందా అనేది చూడాలి. ఈ సమయంలోనే ఈటీవీ ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. క్యాష్ క్యార్రమం ఒక అద్భుతం..

Anchor Suma new show in etv getting trolls

Advertisement

అలాంటి కార్యక్రమాన్ని నిలిపి వేసి అదే సమయంలో అదే యాంకర్‌ తో సుమ అడ్డ అంటూ తీసుకు రావడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మల్లెమాల వారు ఎందుకు క్యాష్ షో ను ఆపేసి సుమ అడ్డ కార్యక్రమాన్ని తీసుకు వస్తున్నారో క్లారిటీగా చెప్పాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు అయినా కూడా క్యాష్ షో ను చూసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. టీవీల్లో లేదా యూట్యూబ్‌ లో క్యాష్ ను ప్రతి వారం చూసేవారు ఈ వారం షో లేక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమ అడ్డ కొన్ని వారాల వరకు క్యాష్ షో గుర్తుకు వస్తూనే ఉండవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి