Home » Entertainment » Anchor Suma On Her Busy Life In Cash Show
Entertainment

Anchor Suma : కామెడీగానే అన్నా నిజం చెప్పేసింది.. యాంకర్ సుమ రేంజ్ ఇదే

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 2, 2022, 2:00 pm
Advertisement

Anchor Suma : టాలీవుడ్‌లో ఏ హీరో బిజీగా ఉన్నా లేకపోయినా.. ఏ హీరోయిన్ వరుసగా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా లేకపోయినా సుమ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఇటు బుల్లితెర షోలు, అటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మరో వైపు ఇప్పుడు కొత్తగా సినిమాల్లో నటించడం. ఇంకో వైపు యాడ్స్. ఇవన్నీ కాకుండా సోషల్ మీడియా అంటే యూట్యూబ్ బిజినెస్ ఇలా ప్రతీ ఒక్క క్షణం సంపాదన కోసమే వాడుతూ ఉంటుంది.

Advertisement

సుమ బిజీగా ఉండని రోజంటూ ఉండకపోవచ్చు. అంత బిజీగా ఉండే సుమ ఎప్పుడూ కూడా చిరాగ్గా కనిపించదు. అది బుల్లితెర అయినా, స్టేజ్ మీద ఈవెంట్ అయినా కూడా నవ్వుతూనే ఉంటుంది.తాజాగా క్యాష్ ప్రోమోలో సుమ నవ్వుతూనే కామెడీ చేస్తూనే తన గురించి ఓ నిజం చెప్పేసుకుంది. లూజర్ సీజన్ 2 టీంను గెస్టుగా పిలిచింది. ఈ సీజన్ 2 బాగా హిట్ అయిందని విన్నాను అంటూ సుమ చెబుతుంది.

Anchor Suma On Her Busy Life in Cash Show

Advertisement

Anchor Suma : బిజీ లైఫ్‌పై సుమ..

అదేంటి? విన్నారా? చూడలేదా? అని ప్రియదర్శి ఆశ్చర్యపోతాడు. నాకు సినిమాలు చూసే టైం కూడా ఉందా? ఒక్కో సారి నా మొహం నేను చూసుకోవడానికి కూడా పది రోజుల టైం పడుతుంది అని తన మీద తానే కౌంటర్ వేసుకుంటుంది. అవును మరి నిజమే. ఇన్ని పనుల మధ్య బిజీగా ఉండే సుమ.. తాపీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసుకుంటూ ఉంటుందా? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి