Home » Entertainment » Anchor Suma Tired At Set Night Shoots
Entertainment

Anchor Suma : సుమ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. సెట్స్‌లో యాంకర్ బాధలు వర్ణనాతీతం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 12, 2022, 4:30 pm
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ ఇన్ని రోజులు న్యూయార్క్‌లో ఎంజాయ్ చేసిన వచ్చింది. సుమ లేనన్ని రోజులు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఎంత చప్పగా కొనసాగాయో అందరికీ తెలిసిందే. ఇక సుమ రాకతో మళ్లీ ఆ ఉత్సాహం వచ్చేసింది. అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సుమ నడిపించింది. అలా సుమ రాకపోవడంతో గీత, శ్యామల, మంజూష వంటి వారికి అవకాశాలు వచ్చాయి. కానీ సుమ అడుగు పెట్టడంతో మళ్లీ అందరి చూపు ఆమె వైపు పడ్డాయి. మొత్తానికి సుమ మళ్లీ ఇప్పుడు ఫుల్ బిజీగా మారింది. ఇన్ని రోజులు షూటింగ్‌లకు గ్యాప్ ఇవ్వడంతో అన్నీ ఒకేసారి మీదకు వచ్చినట్టున్నాయ్. అసలే సుమ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది.

Advertisement

స్టార్ మా, ఈటీవీ, జీ ఇలా అన్ని చానెల్స్లో ఏదో ఒక ప్రోగ్రాం లేదా పండుగ ఈవెంట్ లేదా సినిమా ఫంక్షన్లకు సంబంధించిన షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది. ఇక అలా షూటింగ్‌లో ఉన్నప్పుడు కాస్తంత టైం ఖాళీ దొరికితే దాన్ని సోషల్ మీడియా కోసం వాడుతుంటుంది. సోషల్ మీడియాలో సుమ ఈ మధ్య ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసే కామెడీకి, స్పాంటేనిటికీ, ఫన్నీ వీడియోలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఒకప్పుడు సుమ సోషల్ మీడియాను అంతగా పట్టించుకునేది కాదు. ఎవరి కోసం యూట్యూబ్ చానెల్ నడిపించింది.

Anchor Suma Tired At Set Night Shoots

Advertisement

తన పేరు మీద సుమక్క అంటూ యూట్యూబ్ చానెల్ నడిపించింది.కానీ ఇప్పుడు సొంతంగా యాంకర్ సుమ అనే యూట్యూబ్ చానెల్ పెట్టేసుకుంది. ఇక సోషల్ మీడియాలో సుమ నేరుగా తన అభిమానులతో టచ్‌లోకి వచ్చేస్తోంది. రకరకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా సుమ తాను సెట్‌లో ఎంత కష్టాలు పడుతుందో చెప్పుకొచ్చింది. నిద్ర వస్తున్నా కూడా ఆపుకుంటున్నట్టుగా చెప్పేసింది. నైట్ పూట షూటింగ్‌లు ఇలానే ఉంటాయని సుమ చెప్పుకొచ్చింది. మొత్తానికి సుమ వెకేషన్‌లో చేసిన ఎంజాయ్ ఇలా బయటకు వస్తోందన్న మాట.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి