Home » Entertainment » Anchor Varshini Night Party With Pranith Bramandapally And Comedian Viva Harsha
Entertainment

Anchor Varshini : నైట్ పార్టీలో వర్షిణి.. డైరెక్టర్, కమెడియన్‌తో హాట్ యాంకర్ పార్టీ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 6, 2022, 12:30 pm
Advertisement

Anchor Varshini : యాంకర్ వర్షిణి ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. ఆమె సందడి పూర్తిగా తగ్గిపోయింది. బుల్లితెరపై పూర్తిగా కనుమరుగైంది. ఆమెకు ఉండే ఒకే ఒక్క షో కూడా వెళ్లిపోయింది. కామెడీ స్టార్స్ షోలో సోలో యాంకర్‌గా చాన్స్ వచ్చింది. కొన్ని రోజులు బాగానే చేసుకుంది. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. సినిమా ఆఫర్లు అంటూ బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. దీంతో అటూ ఇటూ కాకుండా మధ్యలో మిగిలిపోయింది. అటు సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు. ఇటు బుల్లితెరపై పూర్తిగా అందరూ మర్చిపోయే స్థితికి వచ్చింది. యాంకర్ వర్షిణి నటించిన మళ్లీ మొదలైంది సినిమా బెడిసి కొట్టేసింది. సుమంత్‌తో కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే పెటుకుంది వర్షిణి.

Advertisement

కానీ అది ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇక సమంత శాకుంతలం సినిమాలోనూ వర్షిణి నటించింది. అయితే ఈ చిత్రం ఆమెకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. అది కూడా తేడా కొట్టిందంటే వర్షిణికి ఇక ఆఫర్లు కూడా రావేమో. అయితే ఇప్పుడు వర్షిణికి బుల్లితెరపై, వెండితెరపై పని లేకుండా పోయినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ మునుపటిలా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఒకప్పుడు అయితే వర్షిణి తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేది. ఫ్యాన్ మేడ్ ఎడిట్‌లు, వీడియోలు చూసి మురిసిపోయేది. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ పోస్టులు పెట్టేది. కానీ ఇప్పుడు వర్షిణి ఎక్కువగా యాక్టివ్ అవ్వడం లేదు. పోస్టులు పెట్టడం లేదు. ఇక వర్షిణి తాజాగా ఓ పోస్ట్ వేసింది.

Anchor Varshini Night Party With Pranith Bramandapally And Comedian Viva Harsha

Advertisement

ఇందులో వీకెండ్ పార్టీని గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఓ దర్శకుడు, కమెడియన్ కూడా కనిపిస్తున్నాడు. వీరితో కలిసి యాంకర్ వర్షిణి తన వీకెండ్ పార్టీని ఫుల్ చిల్ అయినట్టుంది. మొత్తానికి వీరితో కలిసి తిరుగుతుండటంతో అనుమానాలు మొదలయ్యాయి. నిహారిక సినిమాతో ప్రణీత్ బ్రమ్మాండపల్లి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆమెతో కలిసి ఇతను ఎక్కువగా తిరుగుతుంటాడు. అలాంటి దర్శకుడితో వర్షిణి పార్టీ చేసుకుంది. ఇక తోడుగా కమెడియన్ హర్ష కూడా ఉన్నాడు. అంటే వీరి కాంబినేషన్‌లో ఏదైనా సినిమా ఓకే అయిందా? అందుకే వారితో వర్షిణి ఉంటోందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి