బుల్లితెరపై యాంకర్ వర్షిణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఢీ షోలో చేసింది. టీం లీడర్‌గా వర్షిణిని అందరూ ఆడుకునేవారు. ఆమెకు స్టెప్పులు రావని, డ్యాన్స్ రాదని ఎగతాళి చేసేవారు. ఇక ఆమె వేసిన మూన్ వాక్ పిచ్చి గెంతులు మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వర్షిణిని అందరూ ట్రోల్స్ చేశారు. అయితే వర్షిణి మెల్లిమెల్లిగా డ్యాన్సులు నేర్చుకుంది. మరీ అంత పర్‌ఫెక్ట్ కాకపోయినా.. మ్యానేజ్ చేసే వరకు వచ్చింది. చివరకు అదిరిపోయే హాట్ పర్ఫామెన్స్‌లు ఇచ్చే స్టేజ్ వరకు వచ్చింది. అయితే ఢీ షోలోనే ఓ కొత్తట్రాక్ కూడా పుట్టుకొచ్చింది. ఢీ షోలో ఆది, వర్షిణి నడిపించిన ట్రాక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజమైన లవర్సా? ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకుంటున్నారా? అనే అనుమానం వచ్చేలా నటించేశారు.
ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ఇద్దరి పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చేశాయి. ఆది వర్షిణి ప్రేమలో ఉన్నారు, ఇదే ముహూర్తం.. త్వరలోనే పెళ్లి అంటూ ఇలా లెక్కలేనన్ని వార్తలు వచ్చాయ్. మొత్తానికి ఆ ఇద్దరూ మాత్రం వాటిని ఖండించేశారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. వాటికి పుల్ స్టాప్ పెట్టేశారు. కానీ రూమర్లు మాత్రం ఆగేవి కావు. ఎక్కడో చోట ఈ ఇద్దరి వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. మొత్తానికి ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. ఈ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదని అర్థమవుతోంది. తాజాగా వర్షిణి ఓ వీడియోను పెట్టేసింది. అందులో ఆది బర్త్ డేను ప్రైవేట్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది.
ఇక అందులో ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా కనిపించారు. అది ఫ్రెండ్ షిప్ లానే కనిపించడం లేదు. ఇక బర్త్ డే విషెస్ చెబుతూ ఎక్కడా కూడా ఫ్రెండ్ అని చెప్పలేదు. నా జీవితంలో ఎప్పటికీ ఉండాలి.. నువ్ నాకు రైట్ అని ఇలా అనడంతో అనుమానాలు పెరిగిపోతోన్నాయి. ఇకనెటిజన్లు అయితే ఈ జోడికి కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి.. డియర్ ఆది.. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.. నువ్ నా జీవితంలో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటాను.. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఏ సమయంలో అయినా నా కోసం వస్తాడు.. నా సపోర్ట్ సిస్టం.. రైటర్ ఆది.. నువ్ నాకు రైట్ రా ఆది అంటూ వర్షిణి తన ప్రేమను బయటపెట్టేసింది
HMPV : శ్వాసకోశ వ్యాధులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారత అధికారులు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) యొక్క బహుళ కేసులను…
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను 1.5% పెంచుతున్నట్లు ప్రకటించింది.…
Delhi Assembly Elections : భారత కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి అనుకూలంగా ముందుకు…
Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ…
Heart Disease : ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడితో, శారీరక శ్రమలు లేకుండా, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం…
Avocado Fruit : ప్రస్తుతం జీవనశైలిలో ప్రజలందరూ తమకు Avocado Fruit తీరికలేని విధంగా శ్రమిస్తూ ఉన్నారు. ఉద్యోగ వృత్తిలో…
Good News : సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy సర్కార్ రాష్ట్ర డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. అభయహస్తం…
Game Changer: ఒకవైపు నార్త్ ఇండియాలో హీరో అల్లు అర్జున్ తెలుగు సినిమా ‘పుష్ప 2’ Pushpa 2రచ్చ చేస్తుండగానే, ఇప్పుడు…
This website uses cookies.